అక్షరటుడే, వెబ్డెస్క్: Encounter | ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) మరోసారి భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. నారాయణపూర్ జిల్లా (Narayanpur district) మాధ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య బుధవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఆపరేషన్ కగార్లో (operation kagar) భాగంగా బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్‌జీ బలగాలు కలిసి కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు (maoists) ఎదురు పడటంతో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 20 మంది మావోయిస్టులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మాధ్ ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో నక్సల్స్ మావోలు (Naxals and Maoists) ఎదురుపడటంతో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఉదయం నుంచి భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దులోని (Telangana-Chhattisgarh border) కర్రెగుట్టల్లో ఇటీవల ఆపరేషన్ కగార్ ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. 20 రోజుల పాటు బలగాలను అడవులను జల్లెడ పట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. కర్రెగుట్టల (Karregutta) నుంచి మావోలు తప్పించుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో బలగాలు అక్కడ కూంబింగ్ చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే నారాయణపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ (encounter) చోటు చేసుకుంది. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత నంబళ్ల కేశవరావు (Maoist top leader Namballa Kesava Rao) అలియాస్ బసవరాజు మృతిచెందినట్లు సమాచారం.
