అక్షరటుడే, వెబ్‌డెస్క్: Earthquake | ఇండేనేషియాలో భారీ భూకంపం(Major Earthquake) చోటు చేసుకుంది. ఆ దేశంలోని తనింబర్ ఐలాండ్స్ ప్రాంతంలో భూకంపం సంభవించింది.
రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.0గా నమోదు అయింది. తూర్పు మలుకు ప్రావిన్స్‌లోని తువాల్ నగరానికి పశ్చిమాన 177 కిలోమీటర్ల దూరంలో 80 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జియోలాజికల్ శాస్త్రవేత్తలు (Geologists) తెలిపారు. దీని ప్రభావంతో సునామీ ముప్పు లేదని పసిఫిక్ సునామీ(Pacific Tsunami) హెచ్చరిక కేంద్రం తెలిపింది.
భూకంప ప్రభావంతో తూర్పు ఇండోనేషియా (Indonesia)లోని అనేక పట్టణాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనలతో నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు. ఇండోనేషియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలవబడే ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు చోటు చేసుకుంటాయి. అగ్ని పర్వతాలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఏప్రిల్‌లో సైతం ఇండోనేషియాలో భూకంపం వచ్చింది. అప్పుడు 5.9 తీవ్రతతో భూకంపం రాగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.