ePaper
More
    Homeఅంతర్జాతీయంEarthquake | అండమాన్‌ సముద్రంలో భారీ భూకంపం

    Earthquake | అండమాన్‌ సముద్రంలో భారీ భూకంపం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Earthquake | అండమాన్​ సముద్రంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. ఇండోనేషియా (Indonesia)లోని బందే అచే సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.9గా నమోదు అయింది. భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించింది.

    శుక్రవారం మధ్యాహ్నం 12:33 గంటలకు భూకంపం (Earthquake) చోటు చేసుకున్నట్లు తెలిసింది.
    భూకంప కేంద్రానికి దగ్గర ఉన్న ప్రజలు స్వల్ప ప్రకంపనలు గమనించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనస్టం సంభవించలేదు. కాగా అండమాన్‌ సముద్రంలో గత శనివారం సైతం భూమి తెల్లవారుజామున భూమి కంపించింది. అప్పుడు రిక్టర్​ స్కేలుపై భూకంప తీవ్రత 4.6గా నమోదు అయింది. వారం రోజుల వ్యవధిలోనే అండమాన్​ సముద్రం(Andaman Sea)లో రెండు సార్లు భూకంపం సంభవించడం గమనార్హం.

    More like this

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల 1989–90 బ్యాచ్​ పదో...

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల (Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...