Homeఅంతర్జాతీయంAfghan Earthquake | అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం

Afghan Earthquake | అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం

అఫ్గానిస్థాన్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో పలువురు మృతి చెందగా.. అనేక మంది గాయపడ్డారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Afghan Earthquake | అఫ్గానిస్థాన్‌లో (Afghanistan) భారీ భూకంపం సంభవించింది. ఉత్తర అఫ్గాన్​ నగరంలో మజార్-ఎ షరీఫ్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టార్​ స్కేల్​పై దీని తీవ్రత 6.3గా నమోదైంది.

మజార్-ఎ-షరీఫ్ (Mazar-i-Sharif) సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని, కనీసం 10 మంది మరణించారని అధికారులు తెలిపారు. 150 మందికిపైగా గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. భూకంప తీవ్రతతో భారీగా భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు.

Afghan Earthquake | అనేక ప్రాంతాలపై ప్రభావం

అఫ్ఘానిస్థాన్​ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం.. భూకంపం దేశంలోని వాయువ్య, మధ్య, పశ్చిమ, ఉత్తర, ఈశాన్య మరియు తూర్పు మండలాలు సహా అనేక ప్రాంతాలను కుదిపేసింది. భూకంప కేంద్రం మజార్-ఇ-షరీఫ్ నగరానికి సమీపంలోని ఖోల్మ్‌లో ఉందని శాస్త్రవేత్తలు (Scientists) గుర్తించారు. భూకంప కేంద్రం 23 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్, పాకిస్థాన్​లో కూడా ప్రకంపనలు సంభవించాయి.

Afghan Earthquake | తరచూ భూకంపాలు

అఫ్గానిస్థాన్​లో తరచూ భూకంపాలు చోటు చేసుకుంటాయి. ఆగస్టులో ఇక్కడ వచ్చిన భూకంపంతో (Earthquake) తీవ్ర నష్టం జరిగింది. అప్పుడు దాదాపు 2,200 మంది చనిపోయారు. భూకంపాల కారణంగా అఫ్గాన్​లో ఏటా సగటున 560 మంది చనిపోతారు. 80 మిలియన్ల డాలర్ల విలువైన ఆస్తి నష్టం జరుగుతుంది. అఫ్గాన్​ ప్రధాన ఫాల్ట్ లైన్ల వెంట ఉన్నందున తరచుగా భూకంపాలను వస్తాయి. ఆ దేశంలో 1990 నుంచి 5.0 తీవ్రత కంటే ఎక్కువ తీవ్రతతో కూడిన కనీసం 355 భూకంపాలు వచ్చినట్లు సమాచారం.