Homeజిల్లాలునిజామాబాద్​Balkonda Mandal | మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

Balkonda Mandal | మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర నాయకుడు నూతుల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. బాల్కొండలో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు.

- Advertisement -

అక్షర టుడే, బాల్కొండ: Balkonda Mandal | ప్రభుత్వం వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు (Maize purchase centers) ఏర్పాటు చేయాలని బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర నాయకుడు నూతుల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. బాల్కొండ మండల కేంద్రంలో ఆరబెట్టిన మక్కలను పరిశీలించి, రైతుల సమస్యలు తెలుసుకున్నారు.

అనంతరం మాట్లాడుతూ.. మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) చెప్పారని, అయినా ఇప్పటివరకు ప్రారంభించలేదన్నారు. రైతుల ముందే మార్క్‌ఫెడ్‌ డీఎంతో ఫోన్‌లో మాట్లాడారు. మక్కల కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారని అడగగా, తమకెలాంటి ఆదేశాలు రాలేదని ఆయన సమాధానమిచ్చారు.

దీంతో అక్కడే ఉన్న రైతులు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నవీన్, కిసాన్‌ మోర్చా మండల అధ్యక్షుడు నర్సయ్య రైతులు పాల్గొన్నారు.