అక్షరటుడే, వెబ్‌డెస్క్: Maithili Thakur | MLA మైథిలీ ఠాకూర్.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా దాదాపు అందరి నోట్లో నానుతున్న పేరు.. దేశంలోనే అతి పిన్న వయస్సు గల ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక.. సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు మైథిలీ ఠాకూర్. ఏ సామాజిక మాధ్యమంలో చూసినా ఆమె గురించే చర్చ కొనసాగుతోంది. నెటిజన్లు ఆమెను తెగ మోసేస్తున్నారు.
Maithili Thakur | అలీనగర్ నియోజకవర్గం..
బీహార్‌లో మైనార్టీలు అధికంగా ఉన్న అలీనగర్ నియోజకవర్గం Alinagar constituency లో పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాని తరుణంలో జానపద, శాస్త్రీయ గాయని మైథిలీ ఠాకూర్ ముందుకొచ్చారు.
స్థానిక ప్రజలతో కలిసి పోయారు. తాను ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటర్ల మనసు గెలుచుకున్నారు. హేమాహేమీలను తలదన్ని ఎమ్మెల్యేగా గెలుపొందారు.
మైథిలీ ఠాకూర్ 2000 సంవత్సరం జులై 25న జన్మించారు. ఆమె తల్లిదండ్రులు భారతి ఠాకూర్, రమేశ్ ఠాకూర్. చిన్నప్పటి నుంచే జానపద, శాస్త్రీయ గాయనిగా ప్రాచుర్యం పొందారు. పలు టీవీ షోలో ప్రదర్శనలు ఇచ్చారు.
ఇటీవలే భాజపాలో చేరారు. పార్టీ ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో సద్వినియోగం చేసుకున్నారు. ప్రజల్లోకి వెళ్లి విస్తృత ప్రచారం చేశారు. అనూహ్యంగా విజయం సాధించారు.
Maithili Thakur | ఇన్‌స్టాలో 5.5 ఫాలోవర్స్..
గాయని మైథిలీ ఠాకూర్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ఆమెకు ఇన్‌స్టాలో 5.5 మిలియన్ (55 లక్షల మంది) ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమె క్రేజీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అలీనగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో బరిలో నిలిచిన తరుణంలో ఆమె.. సోషల్ మీడియాను కూడా తన ప్రచార అస్త్రంగా వినియోగించుకున్నారు. నెటిజన్లు సైతం అండగా నిలవడం విశేషం.
