అక్షరటుడే, వెబ్‌డెస్క్: MailardevPally accident | రంగారెడ్డి Rangareddy జిల్లా మైలార్దేవ్ పల్లిలో దారుణం చోటుచేసుకుంది. లారీ కింద ప్రమాదవశాత్తు పడి ఓ చిన్నారి దుర్మరణం చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
MailardevPally accident | మలుపు తిప్పుతుండగా..
రియాన్ ఉద్దీన్(8) అనే చిన్నారి నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. అదే మార్గంలో వెళ్తున్న మట్టి లారీ.. మలుపు తిప్పుతుండగా.. దాని వెనుక టైర్ కింద రియాన్ పడ్డాడు.
దీంతో చక్రాల కింద నలిగి రియాన్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
