HomeతెలంగాణMahindra University | మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్‌ కలకలం.. ఏకంగా 50 మంది విద్యార్థులకు పాజిటివ్​

Mahindra University | మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్‌ కలకలం.. ఏకంగా 50 మంది విద్యార్థులకు పాజిటివ్​

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్ : Mahindra University : తెలంగాణ రాష్ట్ర విద్యా ప్రపంచానికే తలమానికంగా ఉన్న హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్‌ వినియోగం కలకలం రేపింది.

ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఏకంగా 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్​ రావడం సంచలనంగా మారింది.

ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ టాస్క్ ఫోర్స్ (Excise Enforcement Agency Task Force) చేపట్టిన తనిఖీలో.. 47 గ్రాముల హై-గ్రేడ్ OG వీడ్, 1.15 కిలోల గంజాయి, డిజిటల్ వేయింగ్ మెషిన్, ప్యాకేజింగ్ మెటీరియల్ లభించాయి.

వీటితోపాటు పోలీసులు మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

Mahindra University : కొంపల్లి రెస్టారెంటులో..

కొంపల్లిలోని ఒక రెస్టారెంటులో విద్యార్థులు డ్రగ్స్ ఆర్డర్ చేసి తీసుకువెళ్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు రెస్టారెంటు నిర్వాహకులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మహీంద్రా యూనివర్సిటీ (Mahindra University) లో EAGLE టీమ్ రైడ్ చేసింది.

ఇక డ్రగ్స్ సరఫరా ఢిల్లీ నుంచి శ్రీ మారుతీ కొరియర్ ద్వారా వచ్చినట్లు విచారణలో తేలింది. 28 గ్రాముల OG వీడ్‌ను రూ.30,000కు కొనుగోలు చేసి, విద్యార్థులకు విక్రయించినట్లు స్పష్టం అయింది.

గతంలో విద్యార్థులు నైజీరియన్ సప్లయర్ నిక్ నుంచి MDMA కొనుగోలు చేసి, పలు పబ్‌లలో పార్టీలు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు.

ఈ నేపథ్యంలో ఈ డ్రగ్స్ రాకెట్‌లో నైజీరియన్ లింక్ ఉందేమో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Mahindra University : విద్యార్థులకు కౌన్సెలింగ్​..

డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయిన నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. పాజిటివ్ వచ్చిన 50 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్​ ఇస్తున్నారు.

తాజా డ్రగ్స్ drug ఘటన విద్యాసంస్థల్లో వినియోగంపై ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులు ఎటువైపు వెళ్తున్నారో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Must Read
Related News