అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mahindra Thar | మహీంద్రా తన ఆఫ్ రోడర్ అయిన థార్ రిఫ్రెష్ వేరియంట్ (Facelift)ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ అప్డేట్ మోడల్‌ను థార్ (Mahindra Thar) కోర్ బాక్సీ డిజైన్, ఆఫ్ రోడ్ సామర్థ్యాన్ని కొనసాగిస్తూనే కొద్దిపాటి ఎక్స్టీరియర్ మార్పులతో రోజువారీ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు సౌకర్యాలతో తీసుకువచ్చింది. కొత్త థార్ ఎక్స్ షోరూం ప్రారంభ ధరను రూ. 9.99 లక్షలుగా నిర్ణయించింది.
Mahindra Thar | ముఖ్యమైన అప్గ్రేడ్లు..
ఇంటీరియర్‌లో పెద్దదైన 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ (ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సహా), రియర్ ఏసీ వెంట్స్, స్లైడింగ్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, రీడిజైన్ అయిన డాష్ బోర్డ్, కొత్త స్టీరింగ్ వీల్, రీ లొకేట్ చేసిన పవర్ విండో స్విచ్‌లు ఉన్నాయి. ఎక్స్టీరియర్ విషయానికి వస్తే.. బాడీ కలర్ ఫ్రంట్ గ్రిల్, వాషర్‌తో రియర్ వైపర్, స్పేర్ వీల్ హబ్‌లో పార్కింగ్ కెమెరా, కొత్తగా టాంగో రెడ్, బాటిల్ షిప్ గ్రే కలర్ షేడ్లున్నాయి.
Mahindra Thar | ఇంజిన్, ట్రాన్స్మిషన్..
2.0 లీటర్ ఎంస్టాలియన్ పెట్రోల్ (Mstallion Petrol), 2.2 లీటర్ ఎంహాక్ డీజిల్, డీ 117 సీఆర్డీఈ డీజిల్ వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. ఇవి 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో వచ్చాయి. డ్రైవ్ కాన్ఫిగరేషన్లలో ఆర్డబ్ల్యూడీ, డ్రైవ్ లైన్ డిస్కనెక్ట్ ఫీచర్‌తో కూడిన 4 X 4 వేరియంట్లున్నాయి. వీటివల్ల థార్‌ను సిటీ వాహనంగానూ, వీకెండ్ ఆఫ్ రోడర్ (Off roader)లానూ ఉపయోగించుకోవచ్చు.
Mahindra Thar | సౌకర్యాలు..
కొత్తగా ఏ పిల్లర్ గ్రాబ్ హ్యాండిల్స్, ఇంధన మూతకు ఇంటీరియర్ ఓపెనింగ్ మెకానిజం, అదనంగా యూఎస్బీ టైప్ సీ పోర్ట్స్ వంటివి జోడించారు.
Mahindra Thar | ఎక్స్ షోరూం ధరలు..
- ఎంట్రీ లెవల్ ఏఎక్స్టీ ఆర్డబ్ల్యూడీ ఎంటీ ట్రిమ్ ధర రూ. 9.99 లక్షలు..
- టాప్ ఎండ్ ఎల్ఎక్స్టీ 4 డబ్ల్యూడీ ఏటీ ట్రిమ్ ధర రూ. 16.99 లక్షలు.
- 4డబ్ల్యూడీ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 16 లక్షలు.