అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mahesh Goud Congress victory | కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టాం కట్టారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (PCC President Mahesh Goud) అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన నిజామాబాద్ (Nizamabad)లో మీడియాతో మాట్లాడారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటిన విషయం తెలిసిందే. దీనిపై మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. సీఎం, మంత్రులు, నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో విజయం సాధించామన్నారు. రాష్ట్రంలో 70 నుంచి 75 శాతం మున్సిపల్ వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుందని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటు వేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్(BRS), బీజేపీ కలిసినా కూడా 25 శాతం సీట్లు సాధించలేదన్నారు.
Mahesh Goud Congress victory | ప్రజలను రెచ్చగొట్టి..
నిజామాబాద్, కరీంనగర్ (Karimnagar) కార్పొరేషన్లలో బీజేపీ (BJP), ఎంఐఎం (MIM) మత విద్వేషాలు రెచ్చగొట్టినా ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ జెండా ఎగుర వేస్తామన్నారు. నిజామాబాద్‌లో గతంలో కాంగ్రెస్‌కు రెండు సీట్లు ఉండేవని, ఇప్పుడు 18 నుంచి 20 స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పారు. ఎంఐఎంతో పొత్తు ఉంటుందా అనే ప్రశ్నకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యాక సీనియర్ నాయకులతో చర్చించి వివరాలు వెల్లడిస్తామన్నారు. నగర అభివృద్ధి కోసం కావాల్సి వస్తే ఎంఐఎంతో కలుస్తామన్నారు.