ePaper
More
    HomeతెలంగాణMahesh babu | నేడు ఈడీ విచారణకు మహేశ్​బాబు!

    Mahesh babu | నేడు ఈడీ విచారణకు మహేశ్​బాబు!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahesh babu | సూపర్​స్టార్ మహేశ్​బాబు నేడు ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌కు (hyderabad) చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్‌లకు (rela estate companies sai surya developers and surana groups) సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate)(ED) మహేష్ బాబును ప్రశ్నించనుంది. ఈ కంపెనీలు అనధికార ప్లాట్‌లను విక్రయించడం, ప్రాజెక్ట్​లను పూర్తిచేయకుండా ఇళ్లు కొన్నవారిని మోసం చేశాయి. అయితే ఈ కంపెనీలకు బ్రాండ్​ అంబాసిడర్​గా మహేశ్​బాబు వ్యవహరించారు. ఆయన ప్రమోషన్​ కోసం రూ.5.9 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

    Mahesh babu | గతంలోనే నోటీసులు

    మహేశ్​బాబుకు (mahesh babu) ఏప్రిల్​ 28న విచారణకు రావాలని ఈడీ అధికారులు (ED officials) ఏప్రిల్ 22న ఈడీ అధికారులు నోటీసులు జారీ (ED officials issued notice) చేశారు. అయితే ఏప్రిల్​ 22న ఆయన విచారణకు హాజరు కాలేదు. తాను షూటింగ్​లో ఉండటంతో రాలేకపోయానని ఈడీకి లేఖ రాశారు. దీంతో ఈడీ అధికారులు ఈరోజు విచారణకు రావాలని మళ్లీ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన విచారణకు వస్తారా.. లేదా అనేది తేలాల్సి ఉంది.

    More like this

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...

    Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద లబ్ధిదారులను గుర్తించాలి

    అక్షరటుడే, ఇందూరు: Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జలవికాసం పథకం ద్వారా...

    Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి

    అక్షరటుడే, కోటగిరి: Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి గిరిజనులంతా ఐక్యతతో ముందుకు సాగి, సేవాలాల్‌ బాటలో...