HomeUncategorizedMahesh Babu | లిటిల్ హార్ట్స్ మూవీపై మహేష్ బాబు స్పెషల్ పోస్ట్.. గాల్లో తేలుతున్న...

Mahesh Babu | లిటిల్ హార్ట్స్ మూవీపై మహేష్ బాబు స్పెషల్ పోస్ట్.. గాల్లో తేలుతున్న టీమ్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahesh Babu | చిన్న బడ్జెట్‌తో రూపొందిన లిటిల్ హార్ట్స్ (Little Hearts) సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. రూ. 2.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 10 రోజుల్లోనే రూ. 32 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

రెండో వారంలో కూడా డీసెంట్ రన్ కొనసాగిస్తోంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుండడంతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) కూడా చేరారు. లిటిల్ హార్ట్స్ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ ఎర్రమల్లి మహేష్ బాబుకు డై హార్డ్ ఫ్యాన్ అన్న విషయం తెలిసిందే.

Mahesh Babu | ఉబ్బితబ్బిబ‌వుతున్నారు..

ఒక ఇంటర్వ్యూలో తన ఫేవరేట్ హీరో సినిమా చూసి సోషల్ మీడియాలో రివ్యూ (social media reviews) పెడితే తనకు లైఫ్‌లో అతిపెద్ద ఆనందమని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్క‌డికైన వెళ్లిపోతాన‌ని చెప్పాడు. సింజిత్ కోరిక మహేష్ వరకూ చేరింది. దీంతో ఆయన ప్రత్యేకంగా సినిమా చూసి సోషల్ మీడియాలో రివ్యూ షేర్ చేశారు. లిటిల్ హార్ట్స్ సినిమా సరదాగా, కొత్తగా, చాలా బాగుంది.

నటీనటులందరూ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా యంగ్ స్టర్స్ యాక్టింగ్ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. చాలా జాయ్‌ఫుల్‌గా ఫీల్ అయ్యాను. సింజిత్.. నువ్వు ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్. ఇక నుంచి బిజీబిజీగా ఉండాల్సి వస్తుంది. రాకింగ్ చేస్తూ ఉండు. మొత్తం టీంకి నా అభినందనలు” అంటూ మహేష్ (Mahesh Babu) తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

మహేష్ ట్వీట్ చూసి సింజిత్ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాడు. “నేను ఇంక ఎక్కడికీ వెళ్లను మహేష్ అన్నా” అంటూ సోషల్ మీడియాలో స్పందించాడు. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు డ్యాన్స్‌కు తాను చేసిన కాత్యాయని సాంగ్‌ను ఎడిట్ చేసి వీడియోగా షేర్ చేశాడు. డైరెక్టర్ సాయి మార్తాండ్, హీరోయిన్ శివానీ నాగరం, హీరో మౌళి తనూజ్ (Mouli Tanooj) లాంటి వారు కూడా మహేష్ బాబు పోస్ట్‌పై ఎమోషనల్‌గా స్పందించారు. “ఇది అస‌లు ఊహించ‌లేదు.. థ్యాంక్యూ స‌ర్” అని దర్శకుడు రియాక్ట్ కాగా, హీరోయిన్ శివానీ “ఇది నాకు స్పెషల్ మెమరీగా నిలిచిపోతుంది” అని చెప్పింది. చిన్న సినిమాలను ప్రోత్సహించే విషయంలో ఎప్పుడూ ముందుండే మహేష్ మరోసారి తన అభిమాని కోరికను నెరవేర్చారు. దీనిపై నెటిజన్లు “మహేష్ గ్రేట్” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.