ePaper
More
    HomeసినిమాMahesh Babu Fans | పాముతో థియేట‌ర్‌లోకి అడుగుపెట్టిన మ‌హేష్ బాబు ఫ్యాన్.. అంతా షాక్

    Mahesh Babu Fans | పాముతో థియేట‌ర్‌లోకి అడుగుపెట్టిన మ‌హేష్ బాబు ఫ్యాన్.. అంతా షాక్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahesh Babu Fans | సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు (Mahesh babu) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయన సినిమా (Movie) వ‌స్తే ఎంత సంద‌డి నెల‌కొంటుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో (Rajamouli Direction) భారీ బ‌డ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంతో మ‌హేష్ బాబు రేంజ్ ఓ లెవ‌ల్‌కి వెళ్లింది. అయితే మ‌హేష్ బాబు న‌టించిన ఖ‌లేజా చిత్రంవ ఇటీవ‌ల రీరిలీజ్ కాగా, మంచి రెస్పాన్స్ అందుకుంది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (director Trivikram Srinivas) ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ‘ఖలేజా (Khaleja)లో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించింది. 2010లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం.. అంచనాలను అందుకోలేకపోయింది.

    Mahesh Babu Fans | ఇదేం పిచ్చిరా..

    బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మారింది. అయితే తర్వాతి రోజుల్లో కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది. టీవీల్లో ఎన్నిసార్లు టెలికాస్ట్ చేసినా డీసెంట్ టీఆర్పీ (TRP) రాబడుతూనే ఉంది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ‘ఖలేజా’ సినిమాని (Khaleja movie) 4K ఫార్మాట్ లో మరోసారి థియేటర్లలోకి తీసుకొచ్చారు . మే 31న కృష్ణ జయంతిని పురష్కరించుకొని, మే 30న ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ (re-releas) చేసారు. ఇప్పటికే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ లో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. కొత్త సినిమాకి ఏమాత్రం తీసిపోని విధంగా ప్రీసేల్స్ రాబడుతోంది అయితే తాజాగా నిర్వహించిన ఈవెంట్ లో సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని మహేష్ అభిమానులే (Mahesh fans) చంపేశారని నవ్వుతూ అన్నారు.

    ఇక ఇదిలా ఉంటే విజయవాడ‌లోని (Vijayawada) ఓ థియేటర్‌లో ఖలేజా మూవీని రీరిలీజ్ చేశారు. ఖలేజా మూవీలో మహేష్ ఎంట్రీ సీన్‌లో (Mahesh entry scene) పాముతో నడిచొచ్చే సీన్‌ వీర లేవల్లో ఉంటుంది. ఓ అభిమాని మహేష్ ఎంట్రీ సీన్‌ను యదావిధిగా అనుకరించాడు. ఏకంగా నిజమైన పాము పిల్లతో థియేటర్లోకి అడుగుపెట్టాడు. మొదట అది రబ్బర్ పాము అని లైట్‌ తీసుకున్న ఫ్యాన్స్.. నిజమైన పాము అని తెలియడంతో పరుగులు పెట్టారు. థియేటర్ యజమానికి (theater owner) తెలియడంతో సదరు అభిమానిని బయటకు పంపించేశారు. ఈ ఘటనతో కాసేపు థియేటర్‌లో గందరగోళం నెలకొంది. అభిమానం ఉండాలి కానీ మరీ ఇంతలానా అంటూ కొందరు ఫ్యాన్స్ ఏకి పారేస్తున్నారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...