అక్షరటుడే, వెబ్‌డెస్క్ : SSMB29 | సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) అభిమానులతో పాటు ఘట్టమనేని కుటుంబాన్ని అభిమానించే ప్రేక్షకులకు గుడ్ న్యూస్ వచ్చిందనే చెప్పాలి.
ఎందుకంటే, పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మహేష్ బాబు – రాజమౌళి చిత్రం నుండి అప్‌డేట్ అయితే వచ్చేసింది. ఇన్నాళ్లు ఈ సినిమా నుండి ఒక్క అప్‌డేట్ అయినా ఇవ్వండని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో మహేష్ బర్త్ డే సందర్భంగా ప్రీ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ (first look poster) నవంబర్ 2025లో షేర్ చేయనున్నట్లు తెలిపారు. జక్కన్న షేర్ చేసిన పోస్టర్లో మహేష్ బాబు మెడలో త్రిశూలం నందితో కూడిన ఒక లాకెట్ వేలాడుతూ కనిపిస్తుంది. ఇక మెడపై నుంచి రక్తం కారుతున్నట్టుగా పోస్టర్‌లో ఉంది. ఇది చూసి ఫ్యాన్స్ పుల్ ఖుష్ అవుతున్నారు.
SSMB29 | అంచనాలు పెరిగాయి..
మొత్తం రివీల్ చేయకపోయిననా, కనీసం ప్రీ లుక్‌తో (Pre Look) అయినా ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేశారని అంటున్నారు. మరోవైపు రాజమౌళి తన పోస్ట్‌లో ఆసక్తికర సందేశం రాసుకొచ్చారు. “ఈ సినిమా షూటింగ్ మేము కొద్ది రోజుల క్రితమే ప్రారంభించాము. సినిమాపై మీ అందరు చూపిస్తున్న ఆసక్తి పట్ల మేము సంతోషంగా ఉన్నాము. భారీ స్థాయిలో మూవీని రూపొందిస్తున్నాము. ప్రెస్ మీట్స్ పెట్టో లేకుంటే ఫొటోలు విడుదల చేసో మేము ఈ సినిమా కథకి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేము. చిత్రాన్ని అద్భుతంగా, డిఫరెంట్‌గా చిత్రీకరిస్తున్నాము. మహేశ్ బాబు లుక్‌ను నవంబర్ 2025లో రిలీజ్ చేస్తాము. ఇది గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉంటుంది. మీ అందరి సహకారం, మద్దతు కొనసాగిస్తారని నమ్ముతున్నాము” అని రాజమౌళి తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
మహేష్ బాబు -రాజమౌళి (Mahesh Babu – Rajamouli) కాంబో అనగానే, సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటం సహజం. కానీ ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా బయటకు రాకపోవడంతో ఫ్యాన్స్ మూవీపై ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ పూర్తయ్యాక, చిత్ర బృందం ఒడిశాకు వెళ్లింది. అక్కడ కొన్ని విజువల్స్ లీక్ అయినా, జక్కన్న మాత్రం దాని గురించి మాట్లాడలేదు.
ఇక ఇప్పటి వరకు అనేక సినిమాల ఫంక్షన్లకు హాజరైనప్పటికీ, SSMB29 గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. చిత్రంలో కథానాయికగా ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) నటిస్తుండగా, ప్రముఖ నటులు పృథ్వీరాజ్ సుకుమారన్, ఆర్ మాధవన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం: ఎమ్.ఎమ్. కీరవాణి అందిస్తున్నారు.