అక్షరటుడే, వెబ్డెస్క్: Mahashivratri Special Pujas | మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. ‘ఓం నమః శివాయ’ పంచాక్షరి మంత్రంతో ఆలయాల ప్రాంగణాలు మార్మోగుతున్నాయి.
Mahashivratri Special Pujas | నగరంలోని నీల కంఠేశ్వరాలయంలో..
నగరంలో అతిపురాతనమైన నీల కంఠేశ్వరాలయంలో(Neela Kanteshwara Temple) తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. భక్తులు రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, నిశి పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలివచ్చారు. ఉదయం ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కుటుంబ సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
శుంభు లింగేశ్వరాయంలో..
నగరంలోని(Nizamabad City) నెహ్రూపార్క్ (Nehru Park) ప్రాంతంలో ఉన్న స్వయంభూ లింగేశ్వరాలయానికి (Shumbhu Lingeshwara Temple) వందల ఏళ్ల చరిత్రి ఉంది. శివరాత్రి సందర్భంగా ఆలయంలో కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం పోలీసు బందోబస్తు సైతం ఏర్పాటు చేశారు.
జిల్లావ్యాప్తంగా..
ఆర్మూర్ పట్టణంలోని సిద్దుగుట్టపై శివలింగాన్ని దర్శించుకునేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే కుక్కగుట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కమ్మర్పల్లి మండలంలోని ఉప్పులూరులో బాల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సర్పంచ్ శైలేందర్ కుటుంబ సభ్యులు, కమ్మర్పల్లి సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ దంపతులు పూజలు నిర్వహించారు. భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్లోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు దర్శనం నిమిత్తం బారులు తీరారు.
కామారెడ్డిలో..
గాంధారి (Gandhari) మండలంలోని భోగేశ్వర ఆలయంలో ఉదయం నుంచి భక్తులు స్వామి దర్శనం కోసం బారులు తీరారు. ప్రత్యేక పూజలు అభిషేకాలు, సప్తాహం నిర్వహించారు. సర్పంచ్ మమ్మాయి రేణుక సంజీవ్ యాదవ్ స్వామివారిని దర్శించుకున్నారు. బాన్సువాడ పట్టణంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ (Lions Club International)ఆధ్వర్యంలో బాన్సువాడ పట్టణంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దుర్కి శివారులోని సోమలింగేశ్వర్ దేవాలయంకు వెళ్లే మార్గంలో భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. శివరాత్రి సందర్భంగా భక్తులకు సేవ చేయడం ఆనందంగా ఉందని లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు బెజుగం వెంకటరమణ, కోశాధికారి బునేకర్ గణేష్, కార్యదర్శి ఖలీద్, ఔట్ స్టాండింగ్ డిస్ట్రిక్ ప్రెసిడెంట్ దుద్దాల అంజిరెడ్డి, బునేకర్ ప్రకాష్, సభ్యులు బెజుగం భాస్కర్, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.
భీమ్గల్ మండలం బడాభీంగల్ లోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
గాంధారి మండలంలోని భోగేశ్వర ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్పంచ్ మమ్మాయి రేణుక సంజీవ్ యాదవ్
నగరంలోని శంభుని గుడిలో అభిషేకాలు..
ఆర్మూర్ కుక్కగుట్ట ఆలయంలో…
దుర్కి శివారులోని సోమలింగేశ్వర్ దేవాలయంకు వెళ్లే మార్గంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పండ్ల వితరణ..
బిచ్కుంద మండలంలోని భోగేశ్వర ఆలయంలో సప్తాహ నిర్వహిస్తున్న దృశ్యం
నగరంలోని శంభుని గుడి ప్రాంగణంలో భక్తుల క్యూ..
నగరంలోని నీల కంఠేశ్వరాలయంలో పూజలు







