HomeజాతీయంMaharashtra Lady Doctor | వైద్యురాలి ఆత్మహత్య.. పోలీసు అధికారిపై అత్యాచార ఆరోపణలు..!

Maharashtra Lady Doctor | వైద్యురాలి ఆత్మహత్య.. పోలీసు అధికారిపై అత్యాచార ఆరోపణలు..!

Maharashtra Lady Doctor | మహారాష్ట్రలోని సతారా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఫల్తాన్ ఆరోగ్య ఉపకేంద్రంలో విధులు నిర్వర్తించే వైద్యురాలు సంపదా ముండే ఆత్మహత్య చేసుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Maharashtra Lady Doctor | మహారాష్ట్రలోని సతారా జిల్లా (Satara district) లో దారుణం చోటుచేసుకుంది. ఈ జిల్లాలోని ఫల్తాన్ ఆరోగ్య ఉపకేంద్రంలో విధులు నిర్వర్తించే వైద్యురాలు సంపదా ముండే (35) Sampada Munde ఆత్మహత్య చేసుకున్నారు.

అంతకు ముందు తన చేతిపై సూసైడ్ నోట్‌ రాసుకున్నారు. అందులో ఒక ఎస్సై తనపై నాలుగుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఉంది. ప్రశాంత్ బంకర్ మానసిక వేధింపులకు గురిచేశాడని పేర్కొంది.

కాగా, వైద్యురాలి ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఫల్తాన్‌లోని ఒక లాడ్జ్‌లో బుధవారం డాక్టర్ సంపదా ఉరేసుకున్నారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి  తరలించారు.

చేతిపై రాసుకున్న సూసైడ్ నోట్‌లో ఎస్సై గోపాల్ బద్నే పేరు రాసి ఉంది. ఆమె మరణానికి ముందు తప్పుడు వైద్య నివేదిక ఇవ్వమని పోలీసులు ఒత్తిడి చేశారని, ఆమె ఫిర్యాదులపై స్పందించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Maharashtra Lady Doctor | వైద్య నివేదిక వివాదం..

ఓ కేస లో వైద్య నివేదికకు సంబంధించి డాక్టర్ సంపదాకు పోలీసులకు గత కొంతకాలంగా వివాదం నెలకొంది. ఈ కేసు విషయంలో పోలీసు ఉన్నతాధికారులకు ఆమె ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కానీ, ఆమె ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.

Maharashtra Lady Doctor | స్పందించిన సీఎం ఫడ్నవీస్

వైద్యురాలి సూసైడ్​ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ Maharashtra Chief Minister Devendra Fadnavis స్పందించారు. సతారా జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. నిందితుడు ఎస్సై గోపాల్ బద్నేను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.

కాగా, ఎస్సై గోపాల్ బద్నే, ప్రశాంత్ బంకర్ పరారీలో ఉన్నారు. పోలీసులు వారి కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Maharashtra Lady Doctor | మహిళా కమిషన్ స్పందన

వైద్యురాలి ఆత్మహత్య ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రుపాలి చకన్కర్ స్పందించారు. వైద్యురాలి ఫిర్యాదులు, నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు.

వైద్య సంఘాల స్పందన

వైద్యురాలి సూసైడ్​ ఘటనను సెంట్రల్ మెడికల్ అసోసియేషన్ (MARD) ఖండించింది. డాక్టర్ సంపదా మరణానికి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.