అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maharashtra | మహారాష్ట్రలో మద్యం మరింత ప్రియం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం (state government) ఎక్సైజ్ డ్యూటీలను (పన్నులను) పెంచాలని నిర్ణయించింది. ఈ పెంపు మద్యం దుకాణాల (liquor shops) నుండి రిటైల్‌గా కొనుగోలు చేసేవారితో పాటు రెస్టారెంట్ లేదా బార్‌లో మద్యం సేవించే వారికి కూడా వర్తించనుంది. మంగళవారం మహారాష్ట్ర కేబినెట్ (Maharashtra cabinet) ఎక్సైజ్ శాఖలో పలు ఆదాయ వృద్ధి చర్యలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మద్యం పన్ను పెంపు ముఖ్యమైనదిగా భావించారు. మన దేశంలో తయారు చేసిన విదేశీ మద్యం(IMFL)పై రాష్ట్ర ఎక్సైజ్ పన్ను 50% కంటే ఎక్కువగా పెంచారు.
Maharashtra | పెరిగిన ధరలు..
దీనివల్ల రిటైల్ ధరలు (Retail Price) 60% కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. దేశీయ మద్యం మరియు విదేశం మద్యం పైనా పన్ను పెరిగింది. వీటి రిటైల్ ధరలు వరుసగా 14% మరియు 25% కంటే ఎక్కువగా పెరుగుతాయని ఓ పత్రిక నివేదించింది. అయితే బీర్ మరియు వైన్‌పై (beer and wine) ఎక్సైజ్ పన్ను పెంపు జరగలేదు. బీర్ రేటు (beer Price) విషయంలో దేశంలో అత్యధిక ధర ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర (Maharashtra) ఒకటిగా ఉంది. వైన్ విషయంలో రాష్ట్రం ప్రోత్సాహ విధానాన్ని అనుసరిస్తోంది. ఈ క్రమంలో వాటి ధరలు పెరగలేదు. ఇక ఈ భారీ పన్ను పెంపుతో ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.57,000 కోట్ల ఆదాయం రాబట్టనుందని సమాచారం.
ఇక 2024-25లో వసూలు చేసిన రూ. 43,620 కోట్లతో పోలిస్తే రూ.14,000 కోట్లు అధికం. మొత్తం ఆదాయంలో దాదాపు 10% ఈ నిర్ణయం ద్వారా రాబట్టగలమని ప్రభుత్వం (government) భావిస్తోంది. ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్న ఖజానాను బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra government) “మహారాష్ట్ర మేడ్ లిక్కర్ (MML)” అనే కొత్త మద్యాన్ని ప్రవేశపెట్టింది. ఇది ధాన్యాలతో తయారవుతుంది. ఈ మద్యం పైన పన్ను పెంపు వర్తించదు. దీని ధరను 180 మిల్లీ లీటర్‌కు రూ.148గా నిర్ణయించారు, ఇది ప్రస్తుతం ఉన్న IMFL ధర పరిధిలోనే ఉండి, మార్కెట్‌లో పోటీ పడే అవకాశం ఉంది.
