HomeజాతీయంKaun Banega Crorepati | కౌన్ బనేగా కరోడ్‌పతి లో 50 లక్షలు గెలుచుకున్న రైతు.....

Kaun Banega Crorepati | కౌన్ బనేగా కరోడ్‌పతి లో 50 లక్షలు గెలుచుకున్న రైతు.. కోటి రూపాయల ప్రశ్నకు జవాబు చెప్పలేక విరమణ

కేబీసీ వినోద కార్యక్రమం అయినప్పటికీ, కైలాశ్ లాంటి సామాన్యులు KBC వేదికగా విజయం సాధించడమే కాదు, లక్షలాది మందికి స్ఫూర్తిగా మారుతున్నారు. పుస్తకాలు, పట్టుదల, ప్రిపరేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ అవకాశాన్ని అర్థవంతంగా వినియోగించుకుంటే జీవితాన్ని మార్చుకోగలమన్న సత్యాన్ని కైలాశ్ నిరూపించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaun Banega Crorepati | మట్టితో మమేకమై పంటలు పండించే ఓ సాధారణ రైతు జీవితంలో ఓ అరుదైన విజయ గాధ నమోదైంది. మహారాష్ట్రకు చెందిన కైలాశ్ కుంటేవార్ అనే రైతు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Bollywood megastar Amitabh Bachchan) నిర్వహిస్తున్న ప్రసిద్ధ క్విజ్ రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి (Kaun Banega Crorepati)’ లో పాల్గొని అద్భుతంగా రూ.50 లక్షలు గెలుచుకున్నారు.

వరదలు, చీడపీడలతో పంటలన్నీ నష్టపోయిన పరిస్థితుల్లో అదృష్టం KBC రూపంలో కైలాశ్‌ని వరించింది. షోలో అమితాబ్ అడిగిన 14 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చి విజయపథంలో నడిచిన ఆయన, కోటి రూపాయల ప్రశ్నకు జవాబు తెలియకపోవడంతో రిస్క్ తీసుకోవడం మానేసి షో నుంచి 50 లక్షల నగదు గెలుపుతో వైదొలిగారు.

Kaun Banega Crorepati | చిన్ననాటి కలను నిజం చేసుకున్న కైలాశ్

మీడియాతో మాట్లాడిన కైలాశ్, చిన్నప్పటి నుంచీ చదువుపట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేదని, KBCని ఒక వినోదాత్మక షోగా మాత్రమే మొదట భావించినప్పటికీ, 2018లో ఓ విజేతతో మాట్లాడిన తర్వాత దాన్ని నిజంగా జీవితాన్ని మార్చే అవకాశంగా మలచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.ఆ సమయం నుంచి రోజూ పొలం పనులు ముగించుకుని ఒక గంట పాటు కేబీసీ కోసం ప్రిపరేషన్ అయ్యేవారట. జనరల్ నాలెడ్జ్ (general knowledge), కరెంట్ అఫైర్స్‌పై మక్కువతో ఆయనకు ఆటలో విజయం సాధించడం సుసాధ్యం అయ్యింది.

14వ ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత 15వ ప్రశ్న కోటి రూపాయల ప్రశ్న వద్ద కొంత అనిశ్చితి నెలకొంది. నాకు జవాబు తెలియదు, కానీ అంచనాకు వేసే స్థితిలో కూడా లేను. అందుకే నేను అప్పటి వరకూ గెలిచిన రూ.50 లక్షలతో సంతృప్తిగా బయటకి వచ్చాను” అని కైలాశ్ (Kailash Kuntewar) తెలిపారు.పిల్లల చదువు కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు స్పష్టం చేశారు. “నేను రైతు అయినా, నా పిల్లల భవిష్యత్తు నా మించినది. వాళ్లు చదువులో ముందంజ వేయాలని కోరుకుంటున్నాను. అందుకే మొదట ఆ డబ్బుతో వారి విద్య కోసం ఖర్చు చేస్తాను” అని తెలిపారు.

కైలాశ్ విజయ గాధ కేవలం ఓ ఆట Game గెలుపు కాదు. అది ఓ సాధారణ రైతు గుర్తింపు పొందిన విజయ సంకేతం. అతని పట్టుదల, నియమిత అభ్యాసం, కుటుంబం పట్ల ప్రేమ.. ఇవన్నీ కలిసి అతని జీవితానికి కొత్త దారితీశాయి. ఇప్పుడు ఆయన విజయగాథ మిలియన్ల మందికి మార్గదర్శిగా నిలుస్తోంది.