అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Eknath Shinde | ఒక్క పైలట్ Pilot నిర్ణయంతో వందల మంది ప్రయాణికుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారిన సంఘటన ఒక విమానాశ్రయం(Airport)లో కలకలం రేపింది. ఒక కమర్షియల్ విమానానికి గానూ బాధ్యతలో ఉన్న పైలట్, విమానాన్ని నడపనని మొండిగా చెప్పేసిన ఘటనతో ప్రయాణం నిలిచిపోయింది. ఈ క్రమంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Deputy Chief Minister Eknath Shinde)కు ఓ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. తాను విమానాన్ని అస్సలే నడపనంటూ పట్టుబట్టారు పైలట్. ఎవరు ఎంత చెప్పినా వినలేదు. కానీ డిప్యూటీ సీఎం సహా ఇతర రాజకీయ నాయకులు వెళ్లి బతిమాలగా.. ఎట్టకేలకు ఒప్పుకున్నాడు. చివరకు వారిని క్షేమంగా గమ్య స్థానానికి చేర్చాడు.
Eknath Shinde | మొండికేశాడు..
జలగావ్ జిల్లా ముక్తాయినగర్‌లో సంత్ ముక్తాయ్ ‘పాల్ఖీ యాత్ర’లో షిండే eknath shinde పాల్గొన్నారు. వాస్తవానికి ఆయన మధ్యాహ్నం 3:45 గంటలకు జలగావ్ చేరుకోవాల్సి ఉండగా, సాంకేతిక కారణాల వల్ల రెండున్నర గంటలు ఆలస్యంగా చేరుకోవల్సి వచ్చింది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ముక్తాయినగర్ వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని మంత్రులు గిరీష్ మహాజన్(Girish Mahajan), గులాబ్‌రావ్ పాటిల్(Gulab Rao Patil) తదితరులతో కలిసి రాత్రి 9:15 గంటలకు షిండే జలగావ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే తన డ్యూటీ ముగియడంతో విమానం నడిపేందుకు పైలట్ నిరాకరించాడు. తిరిగి అనుమతులు తీసుకోవడానికి సమయం పడుతుందని తెలిపారు. పైగా తనకు అనారోగ్యంగా ఉందని కూడా డిప్యూటీ సీఎంకు వివరించాడు.
ఆ సమయంలో షిండే వెంట మంత్రులు గిరీశ్ మహాజన్ Girish Mahajan, గులాబ్ రావ్ పాటిల్ కూడా ఉన్నారు. దాదాపు 45 నిమిషాల పాటు వారు పైలట్‌ను ఒప్పించేందుకు తీవ్రంగా చర్చలు జరిపారు. చివరికి గిరీశ్ మహాజన్ సంబంధిత అధికారులతో మాట్లాడి టేకాఫ్‌కు అనుమతులు కూడా ఇప్పించారు. దీంతో ఎట్టకేలకు విమానం ముంబైకి బయలుదేరి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఓ మహిళకు షిండే మానవతా దృక్పథంతో సహాయం అందించారు. ముంబైలో అత్యవసరంగా కిడ్నీ ఆపరేషన్ చేయించుకోవాల్సిన శీతల్ పాటిల్ అనే మహిళ, ఆమె భర్త విమానం అందుకోలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి గిరీశ్ మహాజన్, షిండే విమానంలో వారిని ముంబైకి తరలించే ఏర్పాటు చేశారు. పేషెంట్ రాక సందర్భంగా ముంబై విమానాశ్రయం(Mumbai Airport)లో అంబులెన్స్ సర్వీసు కూడా అధికారులు సిద్ధంగా ఉంచారు. పని గంటలు ఎక్కువ కావడం వల్ల పైలెట్ ఆరోగ్యం కాస్త క్షీణించిందని.. అందుకే ఆయన విమానం నడపనన్నారని మంత్రి గిరీష్ పేర్కొన్నారు.