అక్షరటుడే, ఇందూరు: Maharana Pratap Jayanthi | ధైర్యానికి, దేశభక్తికి నిలువెత్తు రూపం మహారాణా ప్రతాప్(Maharana Pratap) అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా(MLA Dhanpal Suryanarayana Gupta) అన్నారు. బొందిల రజక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మహారాణా ప్రతాప్ జయంతిని నిర్వహించారు. ఎల్లమ్మ గుట్ట(Yellamma Gutta) చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మొగలుల నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడిన భరతమాత ముద్దుబిడ్డ అని కొనియాడారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Maharana Pratap Jayanthi | దేశభక్తికి నిలువెత్తు రూపం మహారాణా ప్రతాప్
- Advertisement -
