అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mahadevappa BJP Suicide | నారాయణపేట జిల్లా (Narayanpet District) మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డు అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మృతిపై బీజేపీ నాయకులు కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) మహదేవప్ప ఆత్మహత్యపై పార్లమెంట్లో మాట్లాడారు. మహదేవప్ప మరణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఉన్న రాజకీయ వాతావరణానికి నిదర్శనం అన్నారు. షెడ్యూల్డ్ తెగ కుటుంబానికి చెందిన మహదేవప్ప ధైర్యంగా ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేశారన్నారు. ఒక యువ గిరిజన నాయకుడి ఆశను కనుమరుగు చేశారన్నారు.
Mahadevappa BJP Suicide | కాంగ్రెస్ బెదిరింపులతోనే..
కాంగ్రెస్ నాయకుల బెదిరింపులతోనే బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని మహదేవప్పపై ఒత్తిడి చేశారని ఆరోపించారు. ఇది ఆత్మహత్య కాదని, కాంగ్రెస్ పార్టీ (Congress Party), కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అన్నారు. దమ్మూ, ధైర్యం ఉంటే నేరుగా ఎన్నికల్లో కొట్లాడాలన్నారు. ఎంపీ లక్ష్మణ్ రాజ్యసభలో మహదేవప్ప ఆత్మహత్యపై మాట్లాడారు. సీఎం సొంత జిల్లాలో మంత్రి, అధికార పార్టీ ఒత్తిడితో అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఈ దారుణ సంఘటనను సభాముఖంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. బాధ్యులైనవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చేశారు. ఎంపీ డీకే అరుణ మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రి (Maktal Government Hospital)కి చేరుకున్నారు. మహదేవప్ప కుటుంబ సభ్యులను పరామర్శించారు.