అక్షరటుడే, వెబ్డెస్క్ :Pillala Marri | ఈ రోజు పాలమూరు palamuru జిల్లా అంతర్జాతీయ అందగత్తెల రాకతో ఆకర్షణగా మారబోతోంది. మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్లు(Miss World 2025 Contestants) ఈ రోజు మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక, వైద్య కేంద్రాలను సందర్శిస్తారు. అలానే పిల్లలమర్రి మహావృక్షం(Pillalamari Mahavriksham), ఎక్స్‌పీరియం ఎకో పార్క్ వంటి ప్రదేశాలు సందర్శించనున్నారు. ఈ క్రమంలో పిల్లలమర్రి మహావృక్షం గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. భారతదేశంలోని అతి పెద్ద వృక్షాలలో మూడవ స్థానంలో ఉంది పిల్లలమర్రి చెట్టు.750 ఏళ్ల కాలం నాటి పిల్లలమర్రిని ప్రపంచ దేశాలకు ఈ సందర్భంగా పరిచయం చేయనున్నారు.
Pillala Marri | పిల్లలమర్రి చరిత్ర ఇది..
22 మందితో కూడిన సుందరీమణుల బృందానికి మహావృక్షం విశిష్ఠత, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనున్నారు. ఏడు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ చెట్టు..ఉమ్మడి జిల్లాకే తలమానికం. సరైన సంరక్షణ లేక ఈ మహావృక్షం TREE…నాలుగేళ్ల క్రితం ఓశాఖ నేలకొరిగింది. మూడున్నర ఎకరాల్లో విస్తరించిన ఈ మహావృక్షం గత కొన్నేళ్లుగా దూరం నుంచి మాత్రమే పర్యాటకులకు కనువిందు చేసింది. అయితే పునరుజ్జీవంతో ఇక నుంచి పర్యాటకులకు చేరువ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. త్వరలోనే సందర్శకుల కోసం పిల్లలమర్రి గేట్లు తెరవబోతున్నారు.
నాలుగేళ్ల క్రితం తెగులు, చెదలతో పిల్లలమర్రికి pillalamarri కాస్త గడ్డు పరిస్థితి ఎదురయ్యింది. ఓవైపు సరైన నిర్వాహణ లేక ఎండిపోవడం..మరోవైపు చెదలు పట్టడంతో మహావృక్షం కొమ్మలు బాగా దెబ్బతిన్నాయి. ఊడలు ఊడిపోవడం, ఆకులు ఎండిపోవడంతో పచ్చని పందిరి వేసినట్లు ఉండాల్సిన పిల్లల మర్రి కళ తప్పింది. ఒకానోక సందర్భంలో ఈ మహావృక్షం అంతరించిపోతుందేమోనని ఆందోళన చెందగా, పరిస్థితిని గమనించిన నాటి జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్(District Collector Ronald Ross) పిల్లలమర్రి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.సెలైన్ బాటిళ్లలో క్లోరోపెరిపాస్ ద్రావాణాన్ని నింపి చికిత్స అందించారు. పాదుల దగ్గర మట్టిలో జీవం పోయి చెదలు పట్టడంతో… బలమైన సేంద్రీయాలతో కూడిన మట్టిని నింపారు.మర్రిచెట్టుకు బలమైన ఊడలకు ఎలాంటి సమస్య రాకుండా పీవీసీ పైపులను అమర్చి నేరుగా భూమికి చేరేలా ఏర్పాట్లు చేశారు. వాటి ద్వారానే క్లోరోపైరిపాస్ లిక్విడ్(Chloropyripas Liquid) ను అందించారు. ఫారెస్ట్ అధికారుల చోరవతో పిల్లలమర్రికి మళ్లీ జీవం వచ్చింది. ఊడలు బాగా పెరిగి నేలలోకి చొచ్చుకెళ్లాయి. చెదలు పట్టిన కొమ్మలు మళ్లీ ధృడంగా తయారయ్యాయి.
