అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mahabubabad petrol attack | మహబూబాబాద్ (Mahabubabad)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తాను ప్రేమించిన యువతిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి.
మహబూబాబాద్‌లో పట్టణంలోని ప్రగతి నగర్లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తాను ప్రేమించిన యువతి మరొకరితో సన్నిహితంగా ఉంటుందన్న అనుమానంతో పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. అనంతరం ఆ యువకుడు కూడా నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు గమనించి ఇద్దరిని వరంగల్ ఎంజీఎం (Warangal MGM) ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Mahabubabad petrol attack | పోలీసుల దర్యాప్తు
ఆ యువకుడు తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను యువతిపై పోసి నిప్పు అంటించాడు. ఆమె కేకలు విన్న స్థానికులు అక్కడికి వెళ్లారు. అప్పటికే యువకుడు సైతం నిప్పు అంటించుకున్నాడు. దీంతో మంటలను ఆర్పి వేసి ఇద్దరిని ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.