37
అక్షరటుడే, ఎల్లారెడ్డి: Maha Shivaratri Pujas | మహాశివరాత్రి(Maha Shivaratri) సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగిపోయాయి. ఆలయాల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా కమిటీలు ఏర్పాట్లు చేశాయి.
Maha Shivaratri Pujas | ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేటలో..
ఎల్లారెడ్డి(Yellareddy), నాగిరెడ్డిపేట మండలాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తాండూర్ త్రిలింగేశ్వర ఆలయం (Tandoor Trilingeswara Temple), ఎల్లారెడ్డిలోని నీలకంఠేశ్వరాలయం, రాజరాజేశ్వరాలయం, తిమ్మాపూర్(Timmapur) సంగమేశ్వర స్వామి, మీసన్ పల్లి వీరభద్ర ఆలయల్లో భక్తుల సందడి నెలకొంది.
ఆలయాల్లో ఏర్పాట్లు..
ఆలయాల్లో తెల్లవారుజాము నుండి పరమశివుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శివోహం అంటూ శివయ్యను కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. వేకువ జామున 4 గంటల నుంచి భక్తులు ఆలయాల్లో దీపాలు వెలిగించి గరలకంఠుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పరమశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు క్యూలైన్లలో నిల్చున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాండూర్ త్రిలింగేశ్వర ఆలయానికి భక్తుల సంఖ్య అధికంగా తరలివచ్చారు.
శివపార్వతుల కళ్యాణం
ఎల్లారెడ్డి నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో, తిమ్మాపూర్ సంగమేశ్వర స్వామి ఆలయాల్లో శివరాత్రిని పురస్కరించుకొని శివపార్వతులకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. శివ పార్వతుల ఉత్సవ విగ్రహాలను పురవీధుల గుండా ఊరేగింపుగా నిర్వహిస్తూ ఆలయాలకు తీసుకువచ్చారు. వివాహ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి చుట్టూ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్య తరలివచ్చి తిలకించారు.
విద్యుత్ దీపాలతో తాండూర్ త్రిలింగేశ్వర ఆలయం
తాండూర్ త్రిలింగేశ్వర స్వామి ఆలయంలో వెండి శివలింగం కవచాన్ని అందిస్తున్న భక్తులు




