Homeజిల్లాలునిజామాబాద్​Maha padiPuja | భక్తిశ్రద్ధలతో మహా పడిపూజ.. మారుమోగిన అయ్యప్ప శరణు ఘోష

Maha padiPuja | భక్తిశ్రద్ధలతో మహా పడిపూజ.. మారుమోగిన అయ్యప్ప శరణు ఘోష

Maha padiPuja | నగరంలోని సుభాష్​ నగర్​లో అయ్యప్ప స్వామి శరణుఘోష మారుమోగింది. జేవీయార్​ బాబు గురుస్వామి(అడ్వకేట్​) నివాసంలో శనివారం అయ్యప్ప స్వామి మహాపడిపూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Maha padiPuja | నిజామాబాద్​ (Nizamabad) నగరంలోని సుభాష్​ నగర్​లో అయ్యప్ప స్వామి (Ayyappa Swamy) శరణుఘోష Sharanu Ghosha మారుమోగింది.

జేవీయార్​ బాబు గురుస్వామి(అడ్వకేట్​) నివాసంలో శనివారం (అక్టోబరు 25) అయ్యప్ప స్వామి మహాపడిపూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో మహా పడిపూజ..
భక్తిశ్రద్ధలతో మహా పడిపూజ..

సుహాస్​ గురుస్వామి Guruswamy పాల్గొన్న ఈ పూజలో పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు.. స్వామిని నిష్ఠతో కొలిచారు.పూజ ప్రారంభానికి ముందు విఘ్ననాశకుడైన గణపతిని మొదట ఆరాధించారు.

అనంతరం అయ్యప్ప పూజ ఆరంభించారు. స్వామిని శరణు వేడుతూ పంచామృతంతో అభిషేకించారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరతో ధారాభిషేకం చేసి పవిత్ర జలంతో శుద్ధి చేశారు.

Maha padiPuja | స్వామి శరణం అయ్యప్ప

భక్తిశ్రద్ధలతో మహా పడిపూజ..
భక్తిశ్రద్ధలతో మహా పడిపూజ..

స్వామిని పుష్పాలతో, వస్త్రాలతో అలంకరించి దీపారాధన కొనసాగించారు. అయ్యప్ప స్వామి పేర్లను జపిస్తూ అర్చన చేశారు. స్వామికి పాయసం, అరిసెలు, పళ్ళు, కొబ్బరికాయ సమర్పించారు.

అవిరా (అప్పం), పంజసర పాయసం నైవేద్యాలుగా సమర్పించారు. అయ్యప్ప ఆలయానికి వెళ్ళే 18 పడియలను సూచిస్తూ పూజలో 18 పదులు తయారు చేశారు. దీపాలతో హారతి ఇచ్చి “స్వామి శరణం అయ్యప్ప” అంటూ భక్తులు శరణు వేడారు.