199
అక్షరటుడే, కోటగిరి: Maha Padipooja | నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి మండల మహాపడిపూజ ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి మాలధారణ భక్తులు, అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో పూజ్య శ్రీ హనుమంతు రావు జోషి, పూజ్య శ్రీ రాజేశ్వర్ జ్యోతి చేతుల మీదుగా సామూహిక పడిపూజ జరిపారు. సాయిబాబా కళ్యాణ మండపంలో ఈ రమణీయ వేడుక కొనసాగింది.
Maha Padipooja | భజన, అల్పాహారం
ఈ సందర్భంగా గురు, కన్నె స్వాములు కలిసి గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప, అష్టదశ సోపాన, మెట్ల పూజ, హారతి, మంత్రపుష్పం, స్వామి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదములు, అల్పాహారం అందజేశారు. భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమంలో గురు స్వాములు రాధాకృష్ణ, సూదాం శంకర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.