Homeజిల్లాలునిజామాబాద్​Maha Chandi Yagam | పోలీస్​ పరేడ్​ గ్రౌండ్​లో మహా చండీయాగం

Maha Chandi Yagam | పోలీస్​ పరేడ్​ గ్రౌండ్​లో మహా చండీయాగం

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ​: Maha Chandi Yagam | జిల్లావ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నగరంలోని పోలీస్​ పరేడ్​ గ్రౌండ్​లోని (Police Parade Ground) దుర్గా పరమేశ్వరి మందిరంలో మంగళవారం మహా చండీయాగం నిర్వహించారు.

సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) దంపతుల ఆధ్వర్యంలో యాగం నిర్వహించగా.. కలెక్టర్ వినయ్​ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy) దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యాగం అనంతరం అన్నదానం నిర్వహించారు.

కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వా రెడ్డి, అదనపు డీసీపీ (ఏఆర్) రామచంద్రరావు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఎంహెచ్​ఓ రాజశ్రీ, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్​ చింగ్తియాన్మావి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.