అక్షరటుడే, ఆర్మూర్: Jeevan Reddy | జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో (Jubilee Hills by-election) బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను (Maganti Sunitha) భారీ మెజార్టీతో గెలిపించాలని నిజామాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి (Jeevan Reddy) విజ్ఞప్తి చేశారు. సునీతకు మద్దతుగా షేక్‌పేట్ డివిజన్ పరిధిలోని అఖింషా కాలనీ, మినీ బృందావన్ కాలనీలో ఆయన ప్రచారం నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగర (Hyderabad city) అభివృద్ధికి కేసీఆర్ చేసిన కృషిని ఓటర్లకు వివరించారు. రెండేళ్లలో వివిధ పథకాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రజలకు బాకీపడ్డ డబ్బుల వివరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు వాహిద్, షకీల్ అహ్మద్, అకీల్ అహ్మద్, ఖాలిక్ అహ్మద్, అమర్ అహ్మద్, సోయల్ హలీ, శ్రీధర్ చారి, భాస్కర్ నేత, శ్రీనివాస్, శ్రీకాంత్, రాజు, ఇమ్రాన్ ఖురేషి, మహమ్మద్ ఖలీల్, సంతోష్, గోపు రంజిత్, కిరణ్, పృథ్వీ, శ్రీకర్, సైఫ్ తదితరులు పాల్గొన్నారు.