Homeతాజావార్తలుMadonna Sebastian | నా దృష్టిలో గ్లామ‌ర్ షో చేయ‌డం త‌ప్పేమీ కాదు.. హీరోయిన్ షాకింగ్...

Madonna Sebastian | నా దృష్టిలో గ్లామ‌ర్ షో చేయ‌డం త‌ప్పేమీ కాదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

మ‌ల‌యాళ బ్యూటీ మ‌డోన్నా తెలుగు పరిశ్రమలో వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటుంది. ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న “స్పిరిట్” సినిమాలో ఈ అమ్మ‌డు నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Madonna Sebastian | మలయాళ ఇండస్ట్రీలో తన అందం, నటనతో ఆకట్టుకున్న మడోన్నా సెబాస్టియన్ (Madonna Sebastian) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటించిన ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్​కు పరిచయమైన ఈ యువ నటికి తెలుగు సినిమాల్లో పెద్ద‌గా అవ‌కాశాలు రాక‌పోయిన మలయాళం, తమిళ్ పరిశ్రమల్లో (Tamil Industry) ఆమెకు వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అక్టోబర్ 1, 1992న కేరళలోని కొచ్చిలో జన్మించిన మడోన్నా, బెంగుళూరులో తన కాలేజీ చదువులు పూర్తి చేసింది. 2015లో దర్శకుడు అల్ఫోన్స్ పుతిరన్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమమ్ సినిమాతో ఆమె సినిమా ప్రపంచంలో అడుగుపెట్టింది. ప్రేమమ్ సినిమా మలయాళంలో క్లాసిక్ విజయం అందుకోవ‌డంతో పాటు మంచి పేరు తీసుకొచ్చింది.

Madonna Sebastian | గ్లామ‌ర్‌పై కామెంట్స్..

ప్రేమమ్ తర్వాత, నాని Nani హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించడంతో తెలుగు ప్రేక్షకులకు గుర్తింపు వచ్చింది. తమిళ్‌లో కూడా స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించింది. 2024లో ప్రభుదేవాతో (Prabhu Deva) కలిసి జాలియో జింఖానా చిత్రంలో నటించడం ద్వారా మరింత గుర్తింపు పొందింది. ప్రస్తుతం మడోన్నా ఎక్కువగా తమిళ్, మలయాళ సినిమాలపై దృష్టి పెట్టింది. అక్కడ వరుసగా సినిమాల్లో నటిస్తూ, సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయడం ద్వారా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. తెలుగులో అవకాశాలు తగ్గినా, ఆమె ప్రతిభతో టాలీవుడ్‌లో తన స్థానం సుస్థిరం చేసుకుంది.

మలయాళ (Malyalam), తమిళ్ పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన మడోన్నా సెబాస్టియన్ మొదటి రోజుల నుంచి గ్లామర్ షోలకు దూరంగా ఉంటుంది. పాత్ర ప్రాధాన్యతను బ‌ట్టి సినిమాలను ఎంచుకుని, నటన ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, మంచి మార్కులు సంపాదించింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో (Social Media) షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

అందులో ఆమె రూపాన్ని చూసి ఫ్యాన్స్ ఒకసారిగా షాక్ అయ్యారు. “గ్లామర్ షోతో రచ్చ చేయడం ఏంటీ?”, “ఈ బ్యూటీ ఇలా మారిపోయిందేంటీ?” అంటూ కామెంట్స్ చేశారు. తనపై వస్తున్న ట్రోల్స్‌పై Trolls మడోన్నా రియాక్ట్ అయింది. గ్లామర్ షో తప్పేమీ కాదు.. కానీ గ్లామర్, అసభ్యత మధ్య తేడా తెలిసి ఉంటే చాలు. నేనేమి చేస్తున్నానో నాకు తెలుసు అని పేర్కొంది. ఈ వ్యాఖ్యలతో ఆమె, గ్లామర్ షోలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.