HomeUncategorizedMadhupriya | చెల్లి పెళ్లి ధూంధాం చేసిన మ‌ధుప్రియ‌.. బ‌రాత్‌లో డ్యాన్స్‌లతో ర‌చ్చ లేపిందిగా..!

Madhupriya | చెల్లి పెళ్లి ధూంధాం చేసిన మ‌ధుప్రియ‌.. బ‌రాత్‌లో డ్యాన్స్‌లతో ర‌చ్చ లేపిందిగా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Madhupriya | ‘ఆడపిల్లనమ్మా… నేను ఆడపిల్లనమ్మా’ అనే పాట‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించిన ఫోక్ సింగర్ మధుప్రియ. తెలంగాణ(Telangana) పోరాట కాలంలో తన గాత్రంతో ఉద్యమానికే శక్తినిచ్చిన కళాకారిణి. అనంతరం సినిమా ఇండస్ట్రీ(Film Industry)లోకి అడుగుపెట్టి ‘ఫిదా’ సినిమాలోని ‘వచ్చిండే…’ పాటతో అపారమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ‘గోదారి గట్టు…’ అనే పాటతో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చి, తన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంది. ఇప్పుడు మధుప్రియ(Madhupriya) వ్యక్తిగత జీవితం మళ్లీ నెట్టింట్లో చర్చనీయాంశం అవుతోంది. కారణం ఆమె చెల్లెలు శ్రుతి ప్రియ పెళ్లి.

Madhupriya | అద‌ర‌గొట్టేసింది..

మధుప్రియ చెల్లి శృతి ప్రియ వివాహం ఆగ‌స్ట్ 6న అట్ట‌హాసంగా జ‌రిగింది. ఈ కార్యక్ర‌మానికి స‌న్నిహితులు, బంధువులు, ప‌లువురు సెల‌బ్రిటీలు(Celebrities) హాజ‌ర‌య్యారు. మ‌ధుప్రియ ఫ్యాన్స్ కూడా సంద‌డి చేశారు. అయితే తన చెల్లెలు ఎంగేజ్‌మెంట్, హ‌ల్దీ సంగీత్, బ‌రాత్ అన్నింటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి. ఇంటి పెద్దగా నువ్వే అన్ని బాధ్యతలు భరిస్తున్నావ్, చెల్లికి పెళ్లి చేయడం బాగుంది.. కానీ నీ పెళ్లి సంగతి?” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా మ‌ధుప్రియ చెల్లి పెళ్లి బ‌రాత్‌లో ధూంధాం డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టింది. అందుకు సంబంధించిన వీడియోలు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఇక కొన్నేళ్ల క్రితం మధుప్రియ, శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ వివాహం అప్ప‌ట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే చాలా కాలంగా మధుప్రియ సింగిల్‌గానే క‌నిపిస్తుంది. దీంతో ఆమె విడాకులు తీసుకుందా అన్న విషయంపై చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అయితే మధుప్రియ మాత్రం ఈ అంశంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌డం లేదు. మధుప్రియ పర్స‌న‌ల్ లైఫ్ ఎలా ఉన్నా ప్రొఫెషనల్‌గా మాత్రం దూసుకుపోతుంది. స్టేజ్ షోలు, టీవీ ప్రోగ్రామ్స్, సినిమాల పాటలు, ఓటీటీ ప్రాజెక్టుల ద్వారా వరుస అవకాశాలతో బిజీగా ఉంది. ఆమె పాటలకు ఉన్న డిమాండ్ ఎప్పటికీ తగ్గలేదు.