అక్షరటుడే, ఆర్మూర్: Khelo India Games | ఖేలో ఇండియా బీచ్ వాలీబాల్ (Khelo India Beach Volleyball games) తెలంగాణ జట్టుకు కోచ్‌గా ఆర్మూర్ మండలం మగ్గిడి ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మధు వ్యవహరించనున్నారు. ఈ మేరకు శనివారం ఆయన వివరాలు వెల్లడించారు.
ఈ క్రీడలు ఈనెల 5 నుండి 9 వరకు కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యు డామన్‌లో జరుగునున్నాయని వివరించారు. తెలంగాణ జట్టు కోచ్‌గా (Telangana team coach) మధు ఎంపిక పట్ల తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గజ్జల రమేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ జనరల్ సెక్రెటరీ హనుమంత్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా జనరల్ సెక్రెటరీ మల్లేష్ గౌడ్, నిజామాబాద్ క్రీడల అధికారి పవన్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తిరునగ హరిత, పీడీలు భూపతి, శ్రీనివాస్, యాదగిరి, సురేష్ అభినందించారు.