అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Semi Conductor | సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో భారత్ కీలక పురోగతి సాధించింది. తొలి మేడిన్ ఇండియా చిప్‌ను ఆవిష్కరించింది.
ఢిల్లీలో జరుగుతున్న సెమికాన్ ఇండియా (Semicon India) సదస్సులో భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి 32-బిట్ మైక్రోప్రాసెసర్ విక్రమ్‌ను మంగళవారం ఆవిష్కరించింది. దీనిని ఇస్రో అభివృద్ధి చేసింది. అంతరిక్ష ప్రయోగ వాహనాల కోసం దీనిని తయారు చేశారు. సెమీ కండక్టర్ల కోసం భారత్ దిగుమతులపైనే ఆధారపడుతోంది. గతంలో ఒక్కసారి చిప్‌ల కొరతతో వాహన రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) దేశీయంగా సెమీకండక్టర్ల ఉత్పత్తికి చర్యలు చేపట్టింది.
Semi Conductor | నిర్మాణంలో ఐదు యూనిట్లు
దేశంలో ప్రస్తుతం ఐదు సెమీకండక్టర్ (Semi Conductor) యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. త్వరలో వీటిలో చిప్‌ల ఉత్పత్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. భారత్ స్థిరమైన విధానాలు, ఆర్థిక వృద్ధి ద్వారా నడిచే చిప్ తయారీ రూపకల్పనకు కేంద్రంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ తయారు చేసిన చిప్‌ను ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధాని మోదీకి (PM Modi) అందజేశారు.
Semi Conductor | కఠిన పరిస్థితులను తట్టుకునేలా..
ఇస్రో సెమీకండక్టర్ లాబొరేటరీ విక్రమ్ ప్రాసెసర్‌ను (Laboratory Vikram Processor) అభివృద్ధి చేసిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Minister Ashwini Vaishnav) తెలిపారు. అంతరిక్ష ప్రయోగ వాహనాల కఠినమైన పర్యావరణ పరిస్థితులను తట్టుకునేలా దీనిని రూపొందించినట్లు పేర్కొన్నారు. దిగుమతి చేసుకున్న చిప్‌లపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒక మైలురాయి అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఐదు సెమీ కండక్టర్ యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఒక యూనిట్ పైలట్ లైన్ ఇప్పటికే పూర్తయిందని, రాబోయే నెలల్లో మరో రెండు ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉందని వెల్లడించారు.
Semi Conductor | అనువైన సమయం
పెట్టుబడిదారులను ఉద్దేశించి కేంద్ర మంత్రి (Union Minister) కీలక వ్యాఖ్యలు చేశారు. గత దశాబ్దంలో దేశంలో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి ఆరు రెట్లు పెరిగిందని, ఎగుమతులు ఎనిమిది రెట్లు పెరిగాయని చెప్పారు. దేశ స్థిరమైన విధానాలు, పెరుగుతున్న డిమాండ్ ప్రపంచ సంస్థలు పెట్టుబడి పెట్టడానికి ఇది అనువైన సమయం అని ఆయన అన్నారు. ప్రపంచంలోని చిప్ డిజైన్ ఇంజినీర్లలో దాదాపు 20 శాతం మంది భారతదేశంలోనే ఉన్నారు. ఇది దేశాన్ని ప్రపంచ సెమీకండక్టర్ డిజైన్‌కు కీలకమైన కేంద్రంగా మారుస్తుందని ఓ నివేదిక తెలిపింది.