అక్షరటుడే, వెబ్డెస్క్ : Madanapalle Incident | ఏపీలోని అన్నమయ్య (Annamayya) జిల్లా మదనపల్లిలో ఓ బాలిక దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. నిన్న రాత్రి నుంచి డ్రమ్ములో ఉన్న మృతదేహాన్ని మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో బయటకు తీసుకొచ్చారు.
మదనపల్లి పట్టణంలోని ఏడేళ్ల బాలిక సోమవారం సాయంత్రం కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించారు. పక్కింట్లో ఉంటున్న వ్యక్తి బాలికను తీసుకెళ్లి హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుడు బాలిక మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కాడు. అయితే విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున నిందితుడి ఇంటికి చేరుకున్నారు. ఉదయం నుంచి నిరసన తెలిపారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.
Madanapalle Incident | నిందితుడిని అప్పగించాలని..
బాలికను చంపిన నిందితుడిని తమకు అప్పగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. అతడిని నడిరోడ్డుపై తాము చంపేస్తామన్నారు. కదిరి- మదనపల్లి హైవేపై రాస్తారోకో చేశారు. పోలీసులు సముదాయించిన వినిపించుకోలేదు. పోలీస్ వాహనం ఎక్కి నిరసన తెలిపారు. నిన్న రాత్రి నుంచి నీటి డ్రమ్ములోనే బాలిక మృతదేహం ఉండటంతో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి (Sub-Collector Challa Kalyani) ఘటన స్థలానికి చేరుకున్నారు. బాలిక తల్లిదండ్రులతో చర్చించారు. అనంతరం గది తాళం బద్దలుకొట్టి పోలీసులు లోపలికి వెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Madanapalle Incident | సీఎం విచారం
మదనపల్లె బాలిక హత్య ఘటనపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని బాలిక తల్లిదండ్రులు కోరారు. అంతకు ముందు హోంమంత్రి అనిత సైతం బాధితులతో మాట్లాడారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని, చట్టప్రకారం ముందుకు వెళ్తామని చెప్పారు.