అక్షరటుడే నిజామాబాద్ సిటీ/బోధన్ : Mac Drill | నాలుగైదురోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లాలోని ఆయా శాఖల ఆధ్వర్యంలో మాక్‌డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులను రక్షించే విధానంపై పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది (Firefighters), తెలంగాణ స్పెషల్ పోలీస్ (Telangana Special Police), మున్సిపల్ రెవెన్యూ అధికారులు మాక్‌డ్రిల్ నిర్వహించారు.
భారీ వరదలు (Heavy Floods) వచ్చినప్పుడు బాధితులను ఎలా రక్షించాలో అధికారులు సిబ్బందికి వివరించారు. అగ్నిమాపక సిబ్బంది, తెలంగాణ స్పెషల్ పోలీస్ ఏడో బెటాలియన్‌కు చెందిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది (SDRF Staff), మున్సిపల్, రెవెన్యు శాఖలకు సంబంధించిన సిబ్బంది ప్రజలకు సైతం అవగాహన కల్పించారు. సాలూర మండల కేంద్రంలోని మంజీర వాగుపై మాక్‌డ్రిల్ (Mac Drill) నిర్వహించారు. అలాగే నిజామాబాద్ రూరల్, ఇందల్వాయి, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ పరిధిల్లోనూ మాక్‌డ్రిల్ చేపట్టారు.
బోధన్‌లోని సాలూర మండల కేంద్రంలో మంజీర వాగు వద్ద మాక్‌డ్రిల్ నిర్వహిస్తున్న అధికారులు