అక్షరటుడే, హైదరాబాద్: LVM-03 M6 | ఇస్రో మరో కీలక ప్రయోగం చేపట్టబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఉన్నసతీష్ దావన్ అంతరిక్ష కేంద్రం (శ్రీహరికోట) కేంద్రం నుంచి బ్లూబర్డ్‑6 ప్రయోగం జరగనుంది.
ఈ ఉపగ్రహాన్ని LVM-03 M6 అనే బాహుబలి-2 (Bahubali-2 rocket) రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు. భారత్ ‑ యూఎస్ సంయుక్తంగా ఈ ప్రయోగం చేపడుతున్నాయి. రాకెట్ ప్రయోగ తేదీని ఇస్రో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాగా, ఈ నెల (డిసెంబరు) 15వ తేదీ నుంచి 20వ తేదీ లోపు ప్రయోగించనున్నట్లు సమాచారం.
LVM-03 M6 | ఎన్నో ప్రత్యేకతలు..
ఎల్వీఎమ్-3, M6 ప్రయోగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. isro గతంలో కేవలం రెండు టన్నుల బరువున్న ఉపగ్రహాలను మాత్రమే నింగిలోకి ప్రయోగించేది. అంతకంటే ఎక్కువ బరువైన ఉపగ్రహాలను పంపాలంటే గయా, ఫ్రెంచ్, రష్యా తదితర దేశాల సహకారం తీసుకునేది.
LVM-03 M6 | అప్‌గ్రేడ్ రాకెట్..
ఇప్పుడు ఇస్రో ఆ పరిస్థితులను అధిగమించింది. LVM – 03 అనే సరికొత్త రాకెట్‌ను సిద్ధం చేసింది. ఈ రాకెట్ నాలుగు టన్నుల బరువు ఉన్న ఉపగ్రహాలను సైతం అంతరిక్షంలోకి పంపించగలదు.
ఈ వాహక నౌకను బాహుబలి రాకెట్‌గా పేర్కొంటారు. తాజాగా అంతకు మించి సామర్థ్యాన్ని సొంతం చేసుకుని బాహుబలి 2గా అప్‌గ్రేడ్ అయింది. అంటే LVM- 03 రాకెట్.. LVM-03 M6గా అప్‌గ్రేడ్ అయి, 6.5 టన్నుల బరువున్న అమెరికా బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లబోతోంది.