ePaper
More
    HomeజాతీయంIndian Railways | త‌క్కువ ధ‌ర‌కే ల‌గ్జ‌రీ సేవ‌లు.. భోపాల్ స్టేష‌న్‌లో అందుబాటులోకి తెచ్చిన రైల్వే...

    Indian Railways | త‌క్కువ ధ‌ర‌కే ల‌గ్జ‌రీ సేవ‌లు.. భోపాల్ స్టేష‌న్‌లో అందుబాటులోకి తెచ్చిన రైల్వే శాఖ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Indian Railways | భార‌త రైల్వే శాఖ ప్ర‌యాణికుల కోసం అనేక అధునాత‌న సేవ‌ల‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇప్ప‌టికే వందేభార‌త్(Vande Bharat) లాంటి రైళ్ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డంతో పాటు మిగ‌తా ట్రైన్ల‌లోనూ వ‌స‌తులు మెరుగు ప‌రిచింది. రైల్వే నెట్‌వ‌ర్క్‌ను భారీగా విస్త‌రించ‌డ‌మే కాకుండా సుర‌క్షిత‌మైన, సుఖ‌వంత‌మైన‌ ప్ర‌యాణాన్ని అందిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ప్యాసెంజ‌ర్ల కోసం ల‌గ్జ‌రీ సేవ‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. భోపాల్ రైల్వే స్టేష‌న్(Bhopal Railway Station) ఇందుకు వేదికైంది. అతి త‌క్కువ ధ‌రకే ల‌గ్జ‌రీ సేవ‌లందిస్తోంది.

    Indian Railways | రూ.50 లకే హోట‌ల్ తర‌హా సేవ‌లు..

    భోపాల్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఇకపై తమ వెయిటింగ్ పీరియ‌డ్‌(Waiting Period)ను అసౌకర్యంగా గడపాల్సిన అవసరం లేదు. ఇలంటి వారి కోసం ప్లాట్‌ఫామ్ నంబర్ 1లో కొత్తగా ఏర్పాటు చేసిన‌ ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఎంతో చ‌క్క‌టి అనుభూతిని క‌లిగిస్తుంది. సరసమైన ధరలకు హోటల్ లాంటి సేవలను పొంద‌వ‌చ్చు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్(Chief Minister Mohan Yadav) బుధవారం ప్రారంభించిన ఈ లాంజ్‌లో ల‌గ్జ‌రీ సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. స్టుటి ఎంటర్‌ప్రైజెస్‌తో భాగస్వామ్యంతో (IRCTC) ఈ లాంజ్‌ను ప్రారంభించింది. ప్ర‌యాణిక‌లు రూ.50 చెల్లిస్తే చాలు. హాయిగా ఉండే సోఫాలతో కూడిన ఎయిర్ కండిషన్డ్ హాలులో ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవచ్చు. అలాగే, ఫ్రీగా ఛాయ్ బిస్క‌ట్‌ లేదా కాఫీ, ఉచిత వైఫై, మొబైల్ ఛార్జింగ్ సదుపాయం, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, LED టీవీ, మ్యూజిక్ సిస్టమ్, రైలు సమాచారంతో డిజిటల్ డిస్‌ప్లే వంటి సౌక‌ర్యాల‌ను పొంద‌వ‌చ్చు.

    Indian Railways | రూ.200ల‌కే బఫే

    ఆకలితో ఉండే ప్ర‌యాణికుల కోసం అతి త‌క్కువ ధ‌ర‌లో బ‌ఫేను పొంద‌వ‌చ్చు. రూ.200 చెల్లిస్తే అపరిమిత శాఖాహార బఫే అందుబాటులో ఉంది. ఇడ్లీ-సాంబార్, వడ, చోలే-భటురే, వెజ్ బిర్యానీ, పాస్తా, ఫ్రెంచ్ ఫ్రైస్, పూరీ-సబ్జీ, ఖీర్, సలాడ్, సూప్ వంటివి బ‌ఫేలో భాగంగా ఉన్నాయి. వీటికి తోడు ప్ర‌యాణికుల అభ్య‌ర్థ‌న మేర‌కు పిజ్జా, బర్గర్లు ఇతర స్నాక్స్ కూడా అందిస్తారు. వైవిధ్యాన్ని అందించడానికి మెనూ క్రమం తప్పకుండా మారుతుంది.

    Indian Railways | పిల్లల‌ కోసం..

    లాంజ్‌లో పిల్లల కోసం ప్రత్యేక వ‌సతులు కూడా ఉన్నాయి. వారు ఇక్క‌డ ఇండోర్ ఆటలు కూడా ఆడుకోవచ్చు. లూడో, క్యారమ్, స్నేక్స్ అండ‌ర్ ల్యాడ‌ర్(Snakes Under the Ladder) వంటి గేమ్స్ ఆడుకోవ‌చ్చు.

    Indian Railways | VIP లాంజ్ సేవ‌లు..

    సుదీర్ఘ రైలు ప్రయాణం చేసే ప్ర‌యాణికులు స్నానం చేయ‌డానికి తీవ్ర ఇబ్బంది ప‌డతారు. అలాంటి వారి కోసం ఇక్క‌డ వీఐపీ లాంచ్ సేవ‌లు(VIP launch services) అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.100 చెల్లించి షవర్ సౌకర్యంతో ఫ్రెష్ అవ్వవచ్చు. ఇందులో టవల్, షాంపూ, సబ్బు కూడా ఉంటాయి. రిక్లైనర్ కుర్చీలు, ప్రైవేట్ స్పేస్‌, రూఫ్‌టాప్ లాంజ్, లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉన్నాయి. ఇక‌, బిజినెస్ ప్రయాణికుల కోసం, రూఫ్‌టాప్ కాన్ఫరెన్స్ రూమ్ ఏర్పాటు చేశారు. రూ. 200 ప్యాకేజీలో భాగంగా ప్రొజెక్టర్, మీటింగ్ స్పేస్టీ, కాఫీ, స్నాక్స్ వంటివి అంద‌జేస్తారు. ఇక కుటుంబాల కోసం కూడా ఇక్క‌డ వ‌స‌తులున్నాయి. బేబీ ఫీడింగ్ రూమ్(Baby feeding room) అందుబాటులో ఉంది. తల్లులు ఇక్కడ తమ శిశువులకు హాయిగా తినిపించవచ్చు. క్లోక్ రూమ్, లగేజ్ లాకర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

    Latest articles

    Devotional | శ్రావణంలో మరో అరుదైన శుక్రవారం.. ఇలా చేస్తే కుబేరుడి యోగం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Devotional | శ్రావణ మాసం అంటేనే పండుగలకు, పూజలకు నెలవు. ఆధ్యాత్మికత ఉట్టిపడే ఈ...

    Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రత పూజా విధానం.. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం మీకే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Varalakshmi Vratam | హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది....

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 7 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Inter student | కొత్త చీర కొనివ్వలేదని.. చీరతోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Inter student : నేటి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అతి కష్టం మీద తమ...

    More like this

    Devotional | శ్రావణంలో మరో అరుదైన శుక్రవారం.. ఇలా చేస్తే కుబేరుడి యోగం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Devotional | శ్రావణ మాసం అంటేనే పండుగలకు, పూజలకు నెలవు. ఆధ్యాత్మికత ఉట్టిపడే ఈ...

    Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రత పూజా విధానం.. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం మీకే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Varalakshmi Vratam | హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది....

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 7 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...