Homeజిల్లాలునిజామాబాద్​Wine Shops | మద్యం దుకాణాలకు ప్రారంభమైన లక్కీడ్రా ప్రక్రియ

Wine Shops | మద్యం దుకాణాలకు ప్రారంభమైన లక్కీడ్రా ప్రక్రియ

జిల్లాలో కొత్త మద్యం దుకాణాలకు సంబంధించిన లక్కీడ్రా ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టెండర్లు తెరువనున్నారు. సీపీ సాయిచైతన్య భద్రతను పర్యవేక్షించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Wine Shops | కొత్త మద్యం దుకాణాలకు ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో (Excise Department) లక్కీడ్రా ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లా కేంద్రాల్లో సోమవారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భారతి గార్డెన్స్​లో కార్యక్రమాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సమక్షంలో ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు లక్కీడ్రా ప్రారంభమైంది.

Wine Shops | సీపీ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు

భారతి గార్డెన్స్​​లో (Bharathi Gardens) ఏర్పాటు చేసిన బందోబస్తు ప్రక్రియను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) పర్యవేక్షించారు. నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా మొత్తం 102 మద్యం దుకాణాలకు గాను 2,786 టెండర్లు నమోదయ్యాయి. మద్యం టెండర్ల ప్రక్రియ మొత్తం నాలుగు డివిజన్లుగా విభజించారు.

నిజామాబాద్ డివిజన్​లోని 36 మద్యం దుకాణాలకు 963 దరఖాస్తులు వచ్చాయి. బోధన్ డివిజన్​లో 18 దుకాణాలకు 455 అప్లికేషన్లు, ఆర్మూర్ (Armoor) డివిజన్​లో 25 మద్యం దుకాణాలకు 618, భీమ్​గల్​ డివిజన్​లో 12 మద్యం దుకాణాలకు 369 దరఖాస్తులు వచ్చాయి.

Wine Shops | తనిఖీలు నిర్వహించాకే అనుమతి..

మద్యం టెండర్లకు సంబంధించి లక్కీడ్రాల నిర్వహిస్తున్న భారతి గార్డెన్స్​లోకి తనిఖీలు నిర్వహించాకే లోపలికి అనుమతిస్తున్నారు. అదికూడా హాల్​టికెట్​ ఉన్న దరఖాస్తుదారులను ఒక్కరిని మాత్రమే అనుమతించారు. టెండర్ల ప్రక్రియ జరిగే హాల్లోకి మీడియాను, ఇతరులను అనుమతించలేదు. లక్కీడ్రాకు ఆబ్కారీ శాఖ సూపరింటెండెంట్​ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు.

లక్కీడ్రా నిర్వహిస్తున్న భారతీ గార్డెన్స్​ వద్ద సందడి