Homeతాజావార్తలుLucky Draw For Liquor Shops | లక్కు కిక్కు ఎవరికో.. తెలంగాణలో మద్యం దుకాణాలకు...

Lucky Draw For Liquor Shops | లక్కు కిక్కు ఎవరికో.. తెలంగాణలో మద్యం దుకాణాలకు నేడు లక్కీ డ్రా..

తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల ఏర్పాటు కోసం ఆబ్కారీశాఖ నేడు లక్కీ డ్రా నిర్వహించనుంది. ఏ దుకాణం ఎవరికి దక్కుతుందోనని అందరిలో నెలకొన్న ఆసక్తికి తెరపడనుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Lucky Draw For Liquor Shops | రాష్ట్రవ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాల ఏర్పాటు కోసం ఆబ్కారీశాఖ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మొత్తం 2,620 షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చినట్లు నమోదు కాగా.. ఆబ్కారీశాఖ నేడు లక్కీ డ్రా నిర్వహించనుంది. దీంతో దరఖాస్తుల దారుల భవిష్యత్తు తేలనుంది. ఏ దుకాణం ఎవరికి దక్కుతుందోని అందరిలో నెలకొన్న ఆసక్తికి తెరపడనుంది.

రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాల (TS Liquor Shops) ఏర్పాటుకు ఆబ్కారీశాఖ స్వీకరించిన దరఖాస్తులపై లక్కీ డ్రా నేడు (అక్టోబర్ 27) జరగనుంది. మొత్తం 2,620 మద్యం దుకాణాల కోసం 95,137 దరఖాస్తులు వచ్చాయి. ఈ లక్కీ డ్రా ప్రక్రియను ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. లక్కీ డ్రా నిర్వహణకు సంబంధించి ఆబ్కారీశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ డ్రాతో ఏ దుకాణం ఎవరికి దక్కుతుందో ఈరోజే తేలనుంది.

Lucky Draw For Liquor Shops | తక్కువ దరఖాస్తులు.. 19 దుకాణాలకు డ్రా వాయిదా

ఈసారి పలు మద్యం షాపులకు దరఖాస్తులు చాలా తక్కువగా రావడంతో మొత్తం 19 దుకాణాల లక్కీ డ్రాను ఎక్సైజ్‌ శాఖ వాయిదా వేసింది. వీటిలో శంషాబాద్‌ ఎక్సైజ్‌ జిల్లాలో మూడు షాపులు ఉన్నాయి.

ఖానాపూర్‌ వైన్స్‌ – గతంలో 63 దరఖాస్తులు, ఈసారి 33 మాత్రమే వచ్చాయి. నదర్‌గూడ – గతంలో 92, ఈసారి 31, సర్దార్‌నగర్‌ – గతంలో 61, ఈసారి 35, అదే విధంగా ఆదిలాబాద్‌లో 6, ఆసిఫాబాద్‌లో 7, భూపాలపల్లిలో 2, సంగారెడ్డిలో ఒక దుకాణానికి తక్కువ దరఖాస్తులు రావడంతో వాటి డ్రాను వాయిదా వేశారు. ఈ దరఖాస్తుదారులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు. వీటికి త్వరలో మరోసారి దరఖాస్తులు ఆహ్వానిస్తారు.

Lucky Draw For Liquor Shops | హైదరాబాద్ పరిసరాల్లో అధిక పోటీ

మొత్తం దరఖాస్తుల్లో మూడొంతులు రాజధాని హైదరాబాద్‌ (Hyderabad) మరియు పరిసర ప్రాంతాల నుంచే వచ్చాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, సరూర్‌నగర్, శంషాబాద్‌ ఎక్సైజ్‌ జిల్లాల్లోని 615 షాపులకు 33,835 దరఖాస్తులు (35.56 శాతం) వచ్చాయి. గతసారి 1,31,490 దరఖాస్తులు రాగా, వీటిలో 42,596 (32.39 శాతం) ఇదే ప్రాంతాల్లో నమోదయ్యాయి.

సరూర్‌నగర్, శంషాబాద్‌ Shamshabad ఎక్సైజ్‌ జిల్లాల పరిధిలోని షాపుల్లో ప్రతి ఏటా రూ.40-50 కోట్ల వరకు విక్రయాలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. విక్రయాల్లో 16-20 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశం ఉండడంతో వ్యాపారులు ఈ ప్రాంతాల వైన్స్‌ షాపుల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారని తెలుస్తోంది. లక్కీ డ్రా పూర్తయిన తర్వాత ఎంపికైన దరఖాస్తుదారులకు లైసెన్సులు జారీ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. కొత్త మద్యం దుకాణాలు డిసెంబర్​ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.