Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | ముగిసిన మద్యం టెండర్ల లక్కీ డ్రా

Kamareddy | ముగిసిన మద్యం టెండర్ల లక్కీ డ్రా

కామారెడ్డి జిల్లాలో మద్యం షాపులకు లక్కీ డ్రా ముగిసింది. మొత్తం 49 దుకాణాల్లో 12 దుకాణాలు మహిళలకు దక్కాయి.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | జిల్లాలో 49 మద్యం షాపులకు సోమవారం లక్కీ డ్రా ద్వారా కేటాయింపులు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని రేణుక దేవి గార్డెన్​ (Renuka Devi Garden)లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) మద్యం షాపులకు డ్రా నిర్వహించారు.

జిల్లాలో మొత్తం 49 మద్యం షాపులకు 1,502 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ లక్కీ డ్రా ద్వారా షాపులను కేటాయించారు. మొత్తం 49 మద్యం షాపులలో 12 దుకాణాలు మహిళలకు దక్కాయి. కామారెడ్డి స్టేషన్ పరిధిలో 15 వైన్ షాపులు ఉండగా ఇద్దరు మహిళలకు దుకాణాలు దక్కాయి. దోమకొండ పరిధిలో 8 షాపులు ఉండగా ముగ్గురు మహిళలకు, ఎల్లారెడ్డి పరిధిలో 7 షాపులకు ఇద్దరు మహిళలకు, బాన్సువాడ పరిధిలో 9 మద్యం షాపులకు నలుగురు మహిళలకు, బిచ్కుంద పరిధిలో 10 వైన్ షాపులలో ఒక మహిళకు దుకాణం దక్కింది.

నూతన మద్యం పాలసీ ప్రకారం 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు నూతనంగా టెండర్లు దక్కించుకున్న వారు దుకాణాలు నడుపుకోవచ్చు. టెండర్ల ద్వారా ప్రభుత్వానికి 45.06 కోట్ల ఆదాయం సమకూరింది. దుకాణాలు దక్కించుకున్న వారి నుంచి 1/6 వంతు లైసెన్స్​ అమౌంట్ బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లింపులు చేపట్టారు.

Kamareddy | మీడియాకు అనుమతి నిరాకరణ

మద్యం టెండర్ల లక్కీ డ్రా ప్రక్రియ న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన విలేకరులకు చుక్కెదురైంది. టెండర్ల ప్రక్రియ కార్యక్రమానికి విలేకరులకు అనుమతి లేదని అధికారులు వెనక్కి పంపించారు. గతంలో టెండర్ల లక్కీ డ్రా ప్రక్రియ పూర్తయ్యే వరకు మీడియాకు అనుమతించేవారు. ఇదే విషయాన్ని అధికారులను అడిగితే ఫంక్షన్ హాల్​లో​ కుర్చీలు లేవని లోపలికి అనుమతి నిరాకరించడం గమనార్హం.