Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | బస్సు ప్రయాణికులకు లక్కీడ్రా బాక్సుల ఏర్పాటు

Kamareddy | బస్సు ప్రయాణికులకు లక్కీడ్రా బాక్సుల ఏర్పాటు

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి బస్టాండ్ (Kamareddy bus stand) నుంచి ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా లక్కీడ్రా బాక్సులు (special lucky draw boxes) ఏర్పాటు చేసినట్లు కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్ కుమార్ తెలిపారు.

నేటి నుంచి వచ్చేనెల 6 వరకు సెమీ డీలక్స్, డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీ, అన్ని ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారు తమ టికెట్​ వెనకాల పేరు, ఫోన్ నంబరు రాసి కామారెడ్డి బస్ స్టేషన్​లో ఏర్పాటు చేసిన లక్కీ డ్రా బాక్సుల్లో వేయాలని సూచించారు.

నిజామాబాద్ రీజియన్ పరిధిలో లక్కీ డ్రా ద్వారా ఎంపికైన ప్రయాణికులకు (passengers) బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. మొదటి బహుమతి రూ.25వేలు, రెండవ బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Must Read
Related News