అక్షరటుడే, వెబ్‌డెస్క్: Retired Engineer | రిటైర్డ్ ఇంజినీర్‌ను అదృష్టం వరించింది. తన పుట్టినరోజు నాడు కొన్న లాటరీ టికెట్ రూ.కోట్లు కుమ్మరించింది. గతంలో ఏ భారతీయుడు (Indian) గెలుచుకోని రీతిలో ఏకంగా రూ.225 కోట్లను ఆయన లాటరీలో గెలుచుకున్నారు. ఈ వార్త ఇప్పుడు దేశంలో సంచలనంగా మారింది.
చెన్నైకి చెందిన రిటైర్డ్ ఇంజినీర్ శ్రీరామ్ రాజగోపాలన్ (Chennai retired engineer Sriram Rajagopalan) జీవితాన్ని ఓ లాటరీ టికెట్ (lottery ticket) మార్చేసింది. ఎమిరేట్స్ డ్రా emirates mega draw మెగా 7లో ఏకంగా రూ.225 కోట్లు (సుమారు 27 మిలియన్ డాలర్లు) గెలుచుకున్నాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన శ్రీరామ్ ఇంజినీరింగ్ చదివిన అనంతరం 1998లో సౌదీ అరేబియా (Saudi Arabia) వెళ్లాడు. రెండు దశాబ్దాలకు పైగా అక్కడ పని చేసిన అనంతరం ఇండియాకు తిరిగి వచ్చాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Retired Engineer | కళ్లు మూసుకుని..
లాటరీ టికెట్లు (lottery ticket) కొనే అలవాటు ఉన్న శ్రీరామ్‌కు పలుమార్లు నిరాశే మిగిలింది. దీంతో కొంతకాలంగా ఆయన వాటికి దూరంగా ఉంటున్నారు. అయితే, ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఎమిరేట్స్ డ్రా మెగా 7 లాటరీ టికెట్ (Emirates Draw Mega 7 lottery ticket) కొన్నాడు. మార్చి 16న కళ్లు మూసుకుని స్టైలస్‌ను ఉపయోగించి తన ఫోన్లో యాదృచ్ఛికంగానే అంకెలను నమోదు చేశాడు. అయితే, లాటరీ తనకే వస్తుందని ఆయన ఏమాత్రం ఊహించలేదు. కానీ, లక్కీ డ్రా విజేత (lucky draw winner) తానేనని తెలుసుకుని నమ్మలేకపోయాడు. “ఫలితాలను చూసినప్పుడు నేను నమ్మలేకపోయాను. నేను డ్రా వీడియోను ఒకటికి రెండుసార్లు రీప్లే చేశాను. విజేత సంఖ్యల స్క్రీన్‌షాట్ కూడా తీశాను” అని శ్రీరామ్ తెలిపారు.
Retired Engineer | కొంత చారిటీకి..
విజేతగా నిలిచిన ఆ క్షణంలో ఉంతో ఉద్వేగానికి గురైనట్లు చెప్పారు. 70 శాతం ఆనందం, 30 శాతం భయం వేసిందని తెలిపారు. కానీ చివరకు రూ.225 కోట్ల ఆకస్మిక లాభం (sudden profit) వచ్చినట్లు నమ్మడానికి సమయం పట్టిందన్నారు. ఇది చాలా పెద్ద మొత్తం. నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటిది సాధించలేదని చెప్పారు.
“కానీ ఈ విజయం నాకే కాదు. ఇది నా కుటుంబానికి, నా పిల్లలకు, చదువుతున్న ప్రతి ఒక్కరికీ ఒక ఆశ. ప్రతి తండ్రి తమ పిల్లల భవిష్యత్తును భద్రపరచాలని కలలు కంటాడు. ఇప్పుడు నేను చేయగలను. ఇది తరతరాలుగా సంపదను నిర్మించుకునే అవకాశమని” వివరించారు. ఇంత డబ్బు విషయంలో ఎలాంటి నిర్దిష్ట ప్రణాళికలను వెల్లడించనప్పటికీ, శ్రీరామ్ కొంత మొత్తాన్ని దాతృత్వానికి వెచ్చిస్తానని చెప్పారు. నేను సాధారణ ఉద్యోగిగా (employee) ఉన్నప్పటి కంటే ఇప్పుడు చేయవలసినవి చాలా పెద్దవి ఉన్నాయని తెలిపారు.

