అక్షరటుడే, వెబ్డెస్క్ : Rain Alert | బంగాళాఖాతంలో అల్ప పీడనం (LPA) ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం నుంచి భారీ వర్షాలు (Heavy Rains) పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆగస్టు 12 నుంచి 15 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆగస్టు 12, 13 తేదీల్లో దక్షిణ, తూర్పు తెలంగాణలో అతి భారీ వర్షాలు పడుతాయి. మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో 150 నుంచి 200 మి. మీ. వర్షపాతం నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. ఆగస్టు 14– 15 తేదీల్లో పశ్చిమ, మధ్య తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వాన దంచికొట్టనుంది.
Rain Alert | హైదరాబాద్ నగరంలో..
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వాన దంచికొట్టింది. భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నగరంలో మంగళవారం సాయంత్రం చిరు జల్లులు పడే అవకాశం ఉంది. సాయంత్రం, రాత్రిపూట మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల నేపథ్యంలో అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు.
Rain Alert | దంచికొట్టిన వాన
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం రాత్రి వాన దంచికొట్టింది. వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కుండపోత వాన పడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో 150 నుంచి 200 మి. మీ. వర్షపాతం నమోదు కావడం గమనార్హం.
Rain Alert | రోడ్డుపై వరద.. రాకపోకలు బంద్
వర్షాలతో హైదరాబాద్ నగరంలోని హిమాయత్ సాగర్ (Himayat Sagar)కు భారీగా ఇన్ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి మూసీ నది (Musi River)లోకి నీటిని వదులుతున్నారు. ఈ క్రమంలో హిమాయత్ సాగర్ దిగువన ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సర్వీస్ రోడ్డుపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పోలీసులు ఆ మార్గంలో రాకపోకలు నిలిపి వేశారు. ఓఆర్ఆర్పై ఎగ్జిట్ 17 నుంచి సర్వీస్ రోడ్డులోకి రావొద్దని సూచించారు.
Heavy water flow at downstream of #Himayathsagar lake on #ORR service road at Exit 17. @CYBTRAFFIC police deputed staff for diverting #traffic.
Commuters are requested to follow traffic diversions and avoid the service roads at Exit 17. pic.twitter.com/b5bbG1qzgc
— NewsMeter (@NewsMeter_In) August 12, 2025