heavy rains | అరేబియా సముద్రంలో అల్పపీడనం.. భారీ వర్షాలకు కర్ణాటకలో ముగ్గురి మృతి
heavy rains | అరేబియా సముద్రంలో అల్పపీడనం.. భారీ వర్షాలకు కర్ణాటకలో ముగ్గురి మృతి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: heavy rains : అరేబియా సముద్రం(Arabian Sea)లో అల్పపీడనం(low pressure) ఏర్పడింది. ఈ నేపథ్యంలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) హెచ్చరికలు జారీ చేసింది. కర్ణాటక (Karnataka), కేరళ (Kerala), ఒడిశా (Odisha)లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీ (AP), అసోం (Assam), మేఘాలయ (Meghalaya), గోవా (Goa), పశ్చిమబెంగాల్‌లోనూ(West Bengal) వానలు పడనున్నాయి. సిక్కిం (Sikkim), తమిళనాడు (Tamil Nadu), పుదుచ్చేరి Puducherry కి తీవ్ర వర్ష సూచన జారీ అయ్యాయి.

మరోవైపు కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూరులో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. కర్ణాటకలో భారీ వర్షాలకు 3 రోజుల్లో ఐదుగురు మరణించారు. వర్షాల నేపథ్యంలో తుంగభద్ర(Tungabhadra), వేదవతి (Vedavati) నదులకు జలకళ వచ్చింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పొంగిపొర్లుతున్న వాగులతో నెట్రవట్టి – హాలహర్వి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ఇక మరో నాలుగు రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు southwest monsoon ప్రవేశించనున్నాయి. నేడు కర్ణాటక తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణ Telangana లో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు thundershowers, మెరుపుల(lightning)తో కూడిన వర్షాలు పడతాయి. గంటకు 30 నుంచి 40 కి.మీ.వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.