అక్షరటుడే, వెబ్‌డెస్క్: Louisville UPS cargo plane crash | అమెరికాలోని లూయిస్‌విల్లేలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన యూపీఎస్ కార్గో విమానం కొద్దిసేపటికే కూలిపోయింది.
అమెరికాలో America ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. లూయిస్‌విల్లేలోని ముహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే యూపీఎస్ కార్గో విమానం కూలిపోయి పేలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. మరో 11 మంది గాయపడ్డారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం స్థానిక కాలమానంలో మంగళవారం సాయంత్రం 5.15 గంటలకు (తెల్లవారుజామున 3.45 గంటలకు) జరిగింది. హోనులూలుకి వెళ్తున్న ఈ విమానం ఎగిరిన కొద్ది సేపటికే ఇంజిన్ సమస్య తలెత్తి కూలిపోయిందని అధికారులు తెలిపారు.
Louisville UPS cargo plane crash | పెద్ద శబ్దం, భారీ మంటలు
ఈ ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియో ఆధారంగా.. టేకాఫ్‌కు ముందు నుంచే విమానం Aeroplane ఎడమ రెక్క నుంచి మంటలు వెలువడ్డాయి. కొద్ది క్షణాల్లోనే విమానం నియంత్రణ కోల్పోయి నేల మీద పడింది. ఆ సమయంలో పెద్ద శబ్దంతో పాటు మంటలు ఎగిసిపడడం, దట్టమైన పొగ వ్యాపించడం, చుట్టుపక్కల భవనాలకు నష్టం వాటిల్లడం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. విమానం నేలపై పడిన వెంటనే భారీ అగ్నిగోళంగా పేలిపోయింది. సమీపంలోని ఒక భవనం పైకప్పు కూడా తీవ్రంగా దెబ్బతింది.
అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి Hospital తరలించారని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కెంటకీ గవర్నర్ తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశం UPS అతిపెద్ద ఎయిర్ హబ్‌కి సమీపంలో ఉంది. ఇక్కడి నుంచి రోజుకు 300కి పైగా విమానాలు నడుస్తాయి. గంటకు 4 లక్షలకు పైగా ప్యాకేజీలు ప్రాసెస్ చేసే ఈ కేంద్రంలో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఫెడరల్ ఏవియేషన్ అధికారులు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించారు.
