Homeబిజినెస్​Sri Lotus Developers IPO | ‘లోటస్‌’.. అందించేనా లిస్టింగ్‌ గెయిన్స్‌.. నేటి నుంచి మరో...

Sri Lotus Developers IPO | ‘లోటస్‌’.. అందించేనా లిస్టింగ్‌ గెయిన్స్‌.. నేటి నుంచి మరో ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌

- Advertisement -

అక్షరటుడేర, వెబ్​డెస్క్ : Sri Lotus Developers IPO | మెయిన్‌ బోర్డు ఐపీవోలలో (Main board IPO) ఇన్వెస్ట్‌ చేయడానికి ఆసక్తి ఉన్నవారికోసం మరో ఐపీవో వచ్చింది. దీని సబ్‌స్క్రిప్షన్‌ బుధవారం ప్రారంభం కానుంది. శ్రీ లోటస్‌ డెవలపర్స్‌ మంచి లిస్టింగ్‌ గెయిన్స్‌ అందించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

ముంబయికి చెందిన శ్రీ లోటస్‌ డెవలపర్స్‌ (Sri Lotus Developers) నివాస, వాణిజ్య ప్రాంగణాలను నిర్మించడంలో పేరున్న ప్రముఖ కంపెనీలలో ఒకటి. పశ్చిమ పౌష్‌ ప్రాంతంలో పునరాభివృద్ధి ప్రాజెక్టులపై ఈ కంపెనీ దృష్టి సారించింది. ఈ కంపెనీ వాణిజ్య ఆస్తులతో పాటు అల్ట్రా లగ్జరీ, లగ్జరీ (Luxury) రెసిడెన్షియల్‌ ఆస్తులపై చొరవ చూపుతుంది. లగ్జరీ రెసిడెన్షియల్‌ విభాగంలో రూ. 3 కోట్ల నుంచి రూ. 7 కోట్ల ధరల శ్రేణితో 2 బీహెచ్‌కే (BHK), 3 బీహెచ్‌కే ఫ్లాట్లను నిర్మిస్తుంది. 3 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కేలతోపాటు రూ. 7 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన 4ం బీహెచ్‌కే ఫ్లాట్‌లు, పెంట్‌హౌస్‌ల వంటి పెద్ద యూనిట్ల నిర్మాణం, అభివృద్ధి అల్ట్రా లగ్జరీ రెసిడెన్షియల్‌ విభాగంలో భాగంగా ఉన్నాయి. ఈ కంపెనీ ఫ్రెష్‌ ఇష్యూ (Fresh issue) ద్వారా రూ. 792 కోట్లు సమీకరించనుంది.

అనుబంధ సంస్థలైన రిచ్‌ఫీల్‌ రియల్‌ ఎస్టేట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ధ్యాన్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, త్రిక్ష రియల్‌ ఎస్టేట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లలో కొనసాగుతున్న ప్రాజెక్టులైన అమాల్ఫీ, ది ఆర్కాడియన్‌, వరుణ్‌ యొక్క అభివృద్ధి, నిర్మాణ ఖర్చులకు పార్ట్‌ ఫండిరగ్‌ కోసం పెట్టుబడి, సాధారణ కార్పొరేట్‌ ప్రయోజనాలకోసం వినియోగించనున్నారు.

Sri Lotus Developers IPO | ఆర్థిక నివేదిక

2024లో రూ. 466.19 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం(Revenue).. 2025లో రూ. 569.28 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో లాభాలు రూ. 119.14 కోట్లనుంచి రూ. 227.89 కోట్లకు చేరాయి.

ధరల శ్రేణి..

ప్రైస్‌బాండ్‌(Price band) రూ. 140 నుంచి రూ. 150 గా నిర్ణయించారు. ఒక లాట్‌లో 100 షేర్లుంటాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు గరిష్ట ప్రైస్‌బాండ్‌ వద్ద రూ. 15 వేలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

బుధవారం ప్రారంభమయ్యే సబ్ర్‌స్కిప్షన్‌(Subscription) శుక్రవారం ముగుస్తుంది. 4వ తేదీ రాత్రి అలాట్‌మెంట్‌ స్టేటస్‌ తెలిసే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు వచ్చేనెల 6న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.

కోటా, జీఎంపీ..

క్యూఐబీలకు 50 శాతం, ఎన్‌ఐఐ(NII)లకు 15 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్లకు 35 శాతం షేర్లను కేటాయించారు. ఈ కంపెనీ షేర్లు గ్రేమార్కెట్‌లో రూ. 194 ప్రీమియంతో ట్రేడ్‌ అవుతున్నాయి. అంటే ఐపీవో అలాట్‌ అయినవారికి లిస్టింగ్‌ సమయంలో 29 శాతం లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.