అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | ఎఫ్ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, ముడి చమురు ధరలు(Crude oil) పెరుగుతుండడంతో స్టాక్ మార్కెట్లు తేరుకోవడం లేదు. ప్రధాన సూచీలు వారాంతాన్ని నష్టాలతోనే ముగించాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 183 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 153 పాయింట్లు పెరిగింది.
ప్రాఫిట్ బుకింగ్‌తో ఇంట్రాడే గరిష్టాల నుంచి 441 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ(Nifty) 21 పాయింట్ల నష్టంతో ప్రారంభమై, 23 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 136 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్(Sensex) 367 పాయింట్ల నష్టంతో 85,041 వద్ద, నిఫ్టీ 100 పాయింట్ల నష్టంతో 26,042 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,745 కంపెనీలు లాభపడగా 2,456 స్టాక్స్ నష్టపోయాయి. 178 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 112 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 120 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 12 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. లక్షల కోట్లు పెరిగింది.
Stock Market | ఐటీలో సెల్లాఫ్..
ఐటీ సెక్టార్లో వరుసగా మూడో సెషన్లోనూ నష్టాలు కొనసాగాయి. బీఎస్ఈలో ఐటీ ఇండెక్స్(IT index) 1.04 శాతం, టెలికాం 0.59 శాతం, క్యాపిటల్ గూడ్ 0.54 శాతం, ఆటో 0.54 శాతం నష్టపోయాయి. ఇన్ఫ్రా(Infra) 0.78 శాతం, మెటల్ 0.47 శాతం, పీఎస్‌యూ 0.40 శాతం, ఎనర్జీ 0.33 శాతం లాభపడ్డాయి. లార్జ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 0.34 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.18 శాతం నష్టంతో ముగిశాయి.
Stock Market | Top gainers..
బీఎస్ఈ సెన్సెక్స్‌లో 6 కంపెనీలు లాభపడగా.. 24 కంపెనీలు నష్టపోయాయి. టైటాన్ 2.13 శాతం, ఎన్టీపీసీ 0.45 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.29 శాతం, హెచ్‌యూఎల్ 0.12 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.11 శాతం పెరిగాయి.
Stock Market | Top losers..
బజాజ్ ఫైనాన్స్ 1.48 శాతం, ఆసియా పెయింట్ 1.41 శాతం, టీసీఎస్ 1.22 శాతం, ఎటర్నల్ 1.12 శాతం, సన్‌ఫార్మా 1.05 శాతం నష్టపోయాయి.