అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | యూఎస్, భారత్‌ల మధ్య వాణిజ్య ఒప్పందం ఎటూ తేలడం లేదు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రోజురోజుకు పడిపోతోంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మన మార్కెట్లలో వరుసగా అమ్మకాలకు పాల్పడుతున్నారు.
దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిని లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. బుధవారం ఉదయం సెన్సెక్స్ 177 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 33 పాయిట్లు పెరిగినా.. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో 474 పడిపోయింది. నిఫ్టీ (Nifty) 42 పాయింట్ల లాభంతో మొదలై మరో 27 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 159 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 120 పాయింట్ల నష్టంతో 84,559 వద్ద, నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 25,818 వద్ద స్థిరపడ్డాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,475 కంపెనీలు లాభపడగా 2,694 స్టాక్స్ నష్టపోయాయి. 159 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 94 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా..196 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 10 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
పీఎస్‌యూ బ్యాంక్స్ మినహా..
బీఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్ (PSU Bank ) ఇండెక్స్1.28 శాతం, ఐటీ ఇండెక్స్ 0.34 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.32 శాతం, ఎనర్జీ 029 శాతం, మెటల్ 0.27 శాతం, పీఎస్‌యూ 0.25 శాతం పెరిగాయి. క్యాపిటల్ గూడ్స్ 0.96 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.94 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ ఇండెక్స్ 0.81 శాతం, రియాలిటీ 0.81 శాతం, ఇండస్ట్రియల్ 0.76 శాతం నష్టపోయాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.85 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.53 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.21 శాతం పడిపోయాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 17 కంపెనీలు లాభాలతో ఉండగా.. 13 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఎస్బీఐ 1.51 శాతం, ఇన్ఫోసిస్ 0.57 శాతం, సన్‌ఫార్మా 00.51 శాతం, టీసీఎస్ 0.41 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.41 శాతం లాభపడ్డాయి.
Top Losers : ట్రెంట్ 1.64 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.99 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.96 శాతం, అదానిపోర్ట్స్ 0.89 శాతం, బజాజ్ ఫిన్సర్వ్ 0.67 శాతం నష్టపోయాయి.