Homeక్రైంShamshabad | పోలీసులపైకి దూసుకొచ్చిన లారీ.. హెడ్​ కానిస్టేబుల్​ మృతి

Shamshabad | పోలీసులపైకి దూసుకొచ్చిన లారీ.. హెడ్​ కానిస్టేబుల్​ మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shamshabad | రంగారెడ్డి(Rangareddy) జిల్లా శంషాబాద్‌(Shamshabad ) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) చోటు చేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన లారీ పోలీస్​ పెట్రోలింగ్​ వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ హెడ్​ కానిస్టేబుల్(Head constable)​ అక్కడికక్కడే మృతి చెందాడు.

బెంగళూరు జాతీయ రహదారిపై(Benguluru Highway) ఎస్​వీఆర్​ ఫంక్షన్​ హాల్​ సమీపంలో శనివారం అర్ధరాత్రి పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతున్నారు. ఈ క్రమంలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ లారీ పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో హెడ్​ కానిస్టేబుల్​ విజయ్‌ కుమార్‌ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కాగా విజయ్​కుమార్​ శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేందర్​ రెడ్డి తెలిపారు.