Homeతాజావార్తలుNalgonda | లారీ బోల్తా.. ఉల్లి బస్తాలు ఎత్తుకెళ్లిన జనం

Nalgonda | లారీ బోల్తా.. ఉల్లి బస్తాలు ఎత్తుకెళ్లిన జనం

నల్గొండ జిల్లాలో ఉల్లి లారీ బోల్తా పడింది. అటుగా వెళ్తున్న వాహనదారులు ఉల్లి బస్తాలు తీసుకొని వెళ్లిపోయారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nalgonda | రాను రాను సమాజంలో మానవత్వం (Humanity) కనుమరుగు అవుతోంది. ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి ఎవరు ముందుకు రావడం లేదు. తమ పనులు తాము చూసుకుంటున్నారు.

రోడ్డు ప్రమాదాలు (road accidents), నడి రోడ్డుపై దాడులు జరిగిన సందర్భాల్లో ప్రజలు పట్టించుకోకుండా వీడియోలు తీసిన ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. అంతేగాకుండా వివిధ సామగ్రితో వెళ్తున్న లారీలు, వాహనాలు బోల్తా పడితే.. ప్రజలు గాయపడిన వారిని పట్టించుకోకుండా అందులోని వస్తువులను ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటన నల్గొండ జిల్లాలో (Nalgonda district) చోటు చేసుకుంది.

హైదరాబాద్​ నుంచి విజయవాడ (Hyderabad to Vijayawada) వైపు వెళ్తున్న లారీ నల్గొండ జిల్లా నార్కెట్​పల్లి వద్ద బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్​, క్లీనర్​ గాయపడ్డారు. అయితే అటుగా వెళ్తున్న వాహనదారులు వారి గురించి పట్టించుకోకుండా.. ఉల్లి బస్తాలు ఎత్తుకెళ్లారు. బైక్​లు, ఆటోల్లో సంచులు వేసుకొని పారిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. ఉల్లి సంచులు ఎత్తుకెళ్లిన వారిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Must Read
Related News