అక్షరటుడే, కామారెడ్డి : Lorry hits : ఇద్దరు యువకులు రోజూ మాదిరిగానే జాగింగ్ కోసం బయలుదేరారు. జాగింగ్ jogging పూర్తి చేసుకుని ఇంటికి తిరుగుముఖం పట్టారు.
ఇంతలో వెనుక నుంచి వస్తున్న లారీ ఆ యువకులను ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ఘటన కామారెడ్డి Kamareddy జిల్లా రామేశ్వర్ పల్లి పరిధి 44వ నంబరు జాతీయ రహదారి National Highway పై శుక్రవారం (సెప్టెంబరు 12) ఉదయం చోటుచేసుకుంది.
Lorry hits : బాధిత యువకుల కథనం ప్రకారం..
కామారెడ్డి Kamareddy మండలం శాబ్దిపూర్ రైట్ తండాకు చెందిన శివకుమార్ సోలార్ ప్లాంట్ లో పని చేస్తున్నాడు. రామేశ్వర్ పల్లి తండాకు చెందిన భదావత్ సంజీవ్ చదువుకుంటున్నాడు.
ఇద్దరు కలిసి శుక్రవారం ఉదయం 5 గంటలకు జాగింగ్ కోసమని జాతీయ రహదరిపైకి వెళ్లారు. గంటన్నర తర్వాత జాగింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరుగుముఖం పట్టారు.
కాగా మేఘన దాబా సమీపంలో జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన లారీ యువకులను ఢీకొట్టి వెళ్ళిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా.. వారిని జీజీహెచ్ కు తరలించారు.
శివకుమార్‌కు తీవ్ర గాయలయ్యాయి. సీరియస్‌గా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సంజీవ్‌కు జీజీహెచ్‌లో చికిత్స కొనసాగుతోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
